RGV: థైస్ బాగున్నాయన్న వర్మ.. చెంప చెళ్లుమనిపించిన అషు!

ఒకప్పుడు ది గ్రేట్ ఫిల్మ్ మేకర్.. పాత చింతకాయ పచ్చడిలాగా మూసలో పడిపోతున్న తెలుగు సినిమాను సైకిల్ చైన్ తెంపి కొత్త దారి చూపించిన ఘనుడు రామ్ గోపాల్ వర్మ. కానీ.. ఇప్పుడో నేనింతే..

RGV: థైస్ బాగున్నాయన్న వర్మ.. చెంప చెళ్లుమనిపించిన అషు!

Rgv

RGV: ఒకప్పుడు ది గ్రేట్ ఫిల్మ్ మేకర్.. పాత చింతకాయ పచ్చడిలాగా మూసలో పడిపోతున్న తెలుగు సినిమాను సైకిల్ చైన్ తెంపి కొత్త దారి చూపించిన ఘనుడు రామ్ గోపాల్ వర్మ. కానీ.. ఇప్పుడో నేనింతే.. నా పైత్యం ఇంతే. పబ్లిసిటీ ఎక్కువా.. పనితనం తక్కువ అనే అపవాదులును మూటగట్టుకున్న మేధావి కూడా మన వర్మనే. ఇండస్ట్రీలోని కొందరు బోల్డ్ బ్యూటీలతో కలిసి ఈ మధ్య అదే రేంజ్ బోల్డ్ ఇంటర్వ్యూలను చేస్తున్న వర్మ ఆ మధ్య బిగ్ బాస్ బ్యూటీ అరియనాతో కలిసి జిమ్ వర్క్ ఔట్స్ తో కలిపి ఇంటర్వ్యూ చేశాడు.

కాగా, ఇప్పుడు మరో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డితో కాఫీతో కలిపి ఇంటర్వ్యూ చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఓ కాఫీ షాప్‌లో కాఫీ తాగుతున్న అషురెడ్డి దగ్గరకు వెళ్లిన వర్మ స్వయంగా తనకు తానే పరిచయం చేసుకున్నాడు. అయితే ఆర్జీవీ ఎవరో తనకు తెలీదనట్టు ఆషు వ్యవహరించింది. ఇంతలో వర్మ.. నీ థైస్‌ బాగున్నాయ్‌.. ఐ లవ్ యువర్ థైస్ అని నిస్సిగ్గుగా చెప్పేశాడు. దీంతో కోపం తెచ్చుకున్న ఆషు వాట్ ది FU** అంటూ వర్మ చెంప చెళ్లుమనిపించింది.

ఇదంతా పక్కా స్క్రిప్టెడ్ అని అర్ధమవుతున్నా.. వర్మ ఏంటి మరీ ఇంత దిగజారి పోయాడంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి. అషు రెడ్డి సోషల్ మీడియాలో స్టార్ కావచ్చు. సినిమాల విషయానికి వస్తే చెప్పుకోదగ్గ ఒక్క సినిమా లేదు. అలాంటి అషుతో వర్మ చెంపదెబ్బ తినడం ఆయన అభిమానులే జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళకి జీర్ణం కాకపొతే.. అది వాళ్ళ ఎసిడిటీ ప్రాబ్లమ్ అని వర్మ అనొచ్చు కానీ.. చూసేందుకు ఆయన శిష్యులకే ఇది కష్టంగా అనిపిస్తుంది. సెప్టెంబరు 7వ తేదీన పూర్తి ఇంటర్వ్యూ రిలీజ్ కానుండగా.. మరి అందులో ఇంకెన్ని చిందులు ఉన్నాయో ఏమో!