RGV : చంద్రబాబు ఏడుపుపై ఆర్జీవీ స్పెషల్ ట్వీట్

చంద్రబాబు నాయుడు ఏడుపును కూడా తన సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా వాడేసుకున్నాడు ఆర్జీవీ. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

RGV : చంద్రబాబు ఏడుపుపై ఆర్జీవీ స్పెషల్ ట్వీట్

Rgv Cbn

RGV :  నిన్న ఏపీ రాజకీయాల్లో ఎన్నడూ లేనంత రణరంగం జరిగింది. 40 సంవత్సరాలకు పైగా రాజకీయ జీవితం ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టడం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. ఇన్ని రోజులు తనను మాత్రమే టార్గెట్ చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు తన కుటుంబాన్ని, తన భార్యను కూడా ఈ నీచ రాజకీయాల్లోకి లాగారంటూ ఆయన కంటతడి పెట్టుకున్నారు. మళ్లీ తాను ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగు పెడతానని, అప్పటి దాకా అసెంబ్లీ మొహం కూడా చూడనంటూ శపథం చేశారు చంద్రబాబు.

shruti hassan : అభిమానులతో చిట్ చాట్.. అలాంటి వాళ్ళని చూస్తే కోపంగా ఉంటుంది

చంద్రబాబు ఏడుపు పై రాజకీయ నాయకులు తమ రీతిలో స్పందిస్తున్నారు. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ కూడా తన మార్క్ ట్వీట్ తో చంద్రబాబు ఏడుపు పై స్పందించారు. చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టిన విజువల్ తన సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇటీవల ఆర్జీవీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను, చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్జీవీ నుంచి ‘ఆర్జీవీ మిస్సింగ్’ అంటూ ఓ సినిమా వస్తుంది. మెగా ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ ఆర్జీవిని కిడ్నాప్ చేస్తే ఎలా ఉంటుంది అనే కథాంశంతో సినిమా తీసి ఇండైరెక్ట్ గా వాళ్ళని ఇందులోకి లాగాడు.

Chiranjeevi: తిరుపతి వర్షాలపై చిరు మెగా ట్వీట్!

చంద్రబాబు ఏడ్చిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసి తన ‘ఆర్జీవీ మిస్సింగ్’ సినిమా ట్రైలర్ చూసి చంద్రబాబు కంటతడి పెట్టుకున్నాడు అంటూ పోస్ట్ చేశాడు వర్మ. అంతే కాక చంద్రబాబుకి థాంక్యూ కూడా చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఏడుపును కూడా తన సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా వాడేసుకున్నాడు ఆర్జీవీ. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తెలుగుదేశం అభిమానులు ఆర్జీవీని టార్గెట్ చేసి తిడుతూ పోస్టులు పెడుతుంటే వైసిపి వర్గీయులు మాత్రం ఈ ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు. మరోసారి ఆర్జీవీ ఎవ్వర్నీ లెక్కచేయకుండా తనకి నచ్చినట్టు ట్వీట్ చేస్తాడని నిరూపించుకున్నాడు.