RGV : అల్లుఅర్జున్ ఒక్కడే సూపర్‌స్టార్.. ఆర్జీవీ సెన్సేషన్ ట్వీట్..

తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటిలాగే తన స్టైల్ లో 'పుష్ప' ట్రైలర్ పై సెన్షేషనల్ కామెంట్స్ చేశాడు. 'పుష్ప' ట్రైలర్ చూసిన ఆర్జీవీ ఆ ట్రైలర్ ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ..

RGV : అల్లుఅర్జున్ ఒక్కడే సూపర్‌స్టార్.. ఆర్జీవీ సెన్సేషన్ ట్వీట్..

RGV :  అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా ‘పుష్ప’. ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా డిసెంబర్ 17న పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా నిన్న రాత్రి ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్న ‘పుష్ప’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ పై అభిమానులు, ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. సుకుమార్ టేకింగ్ కి, అల్లు అర్జున్ మాస్ యాక్టింగ్ కి అంతా ఫిదా అయిపోతున్నారు.

Vikki – Katrina : విక్కీ – కత్రినా పెళ్లి ఫుటేజ్ కోసం 100కోట్ల డీల్

తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటిలాగే తన స్టైల్ లో ‘పుష్ప’ ట్రైలర్ పై సెన్షేషనల్ కామెంట్స్ చేశాడు. ‘పుష్ప’ ట్రైలర్ చూసిన ఆర్జీవీ ఆ ట్రైలర్ ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. అల్లు అర్జున్ మాత్ర‌మే సూప‌ర్ స్టార్. ఇలాంటి రియలిస్టిక్ పాత్ర‌లో న‌టించ‌డానికి భ‌య‌ప‌డ‌లేదు. పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, చిరంజీవి, రజినీకాంత్ లాంటి వారు ఇలాంటి పాత్రలు చేయగలరా? అని ఈ హీరోలని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. అంతే కాక ట్రైలర్ లో అల్లు అర్జున్ చెప్పిన చివరి డైలాగ్ “పుష్ప అంటే ప్లవర్ కాదు.. ఫైర్” అని కూడా తన ట్వీట్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.