RGV : కొడాలి నానికి సపోర్ట్ చేస్తూ వర్మ ట్వీట్లు

తాజాగా ఈ వివాదంపై దర్శకుడు ఆర్జీవీ వరుస ట్వీట్స్ చేశారు. గుడివాడ‌లో క్యాసినో పోటీలు పెట్ట‌డంపై మంత్రి కొడాలి నానికి త‌న పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని, గుడివాడను మోడరేట్ చేయాలనుకున్న..

RGV : కొడాలి నానికి సపోర్ట్ చేస్తూ వర్మ ట్వీట్లు

Rgv (1)

Kodali Nani :  ఏపీలో సంక్రాంతికి కోడి పందాలు, ఎడ్ల పందాలు నిర్వహిస్తారని తెలిసిందే. కొన్ని చోట్ల పేకాట, గుండాటలు కూడా నిర్వహిస్తారు. వీటికి అధికారికంగా ఎలాంటి పర్మిషన్స్ లేకపోయినా రాజకీయ నాయకుల అండదండలతో బహిరంగంగానే నిర్వహిస్తారు. ఈ సారి సంక్రాంతికి కూడా ఏపీలో చాలా చోట్ల ఇవన్నీ నిర్వహించారు. అయితే ఈ సారి ఒక అడుగు ముందుకి వేసి క్యాసినో కూడా నిర్వహించారు.

ఏపీ మంత్రి కొడాలి నాని నియోజకవర్గం, ఆయన సొంతూరు గుడివాడలో ఈ సంక్రాంతికి క్యాసినో క్లబ్బులు నిర్వహించారు. గుడివాడలోని ఓ ఫంక్షన్ హాల్ లో పేకాట శిబిరాలు, గుండాటలతో పాటు క్యాసినో కూడా నిర్వహించారు. దీనిలో ఎంట్రీ కోసం ఏకంగా 10 వేల రూపాయలు చెల్లించాలి. ఈ ఫంక్షన్ హాల్ ప్రాంతంలో ప్రత్యేకంగా బౌన్సర్లను కూడా నియమించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతుండటంతో ఇవి వివాదాస్పదం అయ్యాయి. ఏపీలో క్యాసినో చట్ట విరుద్ధం కావడంతో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

అంతే కాక గుడివాడ‌లో జరిగిన ఈ క్యాసినో వ్యవహారం మంత్రి కొడాలి నాని ఆధ్వ‌ర్యంలోనే జ‌రిగాయ‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు దీనిని వ్యతిరేకిస్తూ చర్యలు తీసుకోవాలంటూ కోరుతూ ఇలాంటివి ప్రోత్సహిస్తున్నందుకు కొడాలి నానిని విమర్శిస్తున్నారు. గత రెండూ రోజులుగా ఈ వివాదం వార్తల్లో నిలుస్తుంది. రోజు రోజుకి ఈ వివాదం ముదురుతోంది. ప్రస్తుతం కొడాలి నాని కరోనా సోకి హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటూ ఉండటంతో ఎవరూ దీనిపై స్పందించటంలేదు.

Krithishetty : కృతిశెట్టి ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా?? కృతి ఎన్ని భాషలు మాట్లాడగలదో తెలుసా??

తాజాగా ఈ వివాదంపై దర్శకుడు ఆర్జీవీ వరుస ట్వీట్స్ చేశారు. గుడివాడ‌లో క్యాసినో పోటీలు పెట్ట‌డంపై మంత్రి కొడాలి నానికి త‌న పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని, గుడివాడను మోడరేట్ చేయాలనుకున్న మీ సంకల్పం మంచిదని, ఎవరు విమర్శలు చేసినా పట్టించుకోవద్దు అంటూ ట్వీట్ చేశారు.

అంతేకాక

”ఈ విషయంలో మంత్రిని నిందిస్తున్న అందరికీ తాను ఓ సూటి ప్రశ్న వేస్తున్నాను. క్యాసినోలు ఉన్న గోవా, పారిస్, లాస్ వేగాస్ లను ఎవరైనా తప్పుగా చూస్తారా?

లండన్, లాస్ వేగాస్, పారిస్ లాంటి నగరాలతో సమానంగా గుడివాడను ముందుకు తీసుకెళ్తున్న మంత్రిని ఎవరైనా అభినందించాలి.

గుడివాడలో క్యాసినోలకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు అంతా ఆ జిల్లా పురోగతిని వెనక్కు లాగుతున్న, చీకట్లోకి నెడుతున్న వారవుతారు.

గుడివాడ ప్రజలు గోవాకు వెళ్తారని గుర్తించాలి. కానీ గోవా ప్రజలు గుడివాడకు రారు కదా. గుడివాడను ఆధునీకరించే ప్రయత్నం చేసినందుకు మంత్రి కొడాలి నానిని అభినందించాలి.” అంటూ వరుస ట్వీట్స్ చేశారు.

MAA : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై సీనియర్ నటుడు నరేష్ వ్యాఖ్యలు

ప్రస్తుతం కొడాలి నాని కరోనా సోకడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు వర్మ ట్వీట్స్ కి ఎవరూ రిప్లై ఇవ్వలేదు. మరి కొడాలి నాని వచ్చాక వీటిపై స్పందిస్తాడేమో చూడాలి.