RGV: ‘సిరివెన్నెలకి ఓ ముద్దు’.. పాట పాడిన రామ్‌గోపాల్ వర్మ

ఎప్పుడూ కాంట్రవర్శీలనే ఇంటిపేరుగా చేసుకుని వార్తల్లో నిలుస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం విషయంలో మాత్రం ఎమోషనల్ అవుతున్నారు.

RGV: ‘సిరివెన్నెలకి ఓ ముద్దు’.. పాట పాడిన రామ్‌గోపాల్ వర్మ

Rgv

RamGopal Varma: ఎప్పుడూ కాంట్రవర్శీలనే ఇంటిపేరుగా చేసుకుని వార్తల్లో నిలుస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం విషయంలో మాత్రం ఎమోషనల్ అవుతున్నారు. సిరివెన్నెల అకాల మరణం తర్వాత.. నేను వస్తా.. నువ్వు స్వర్గానికే వెళ్లుంటావు అంటూ ఓ వాయిస్ వదిలిన రామ్‌గోపాల్ వర్మ లేటెస్ట్‌గా సిరివెన్నెల రాసిన పాటను.. ఆయనకు ఎంతో ఇష్టమైన పాటను నెట్టింట్లో వదిలి ఆయనకు నివాళులు అర్పించారు.

“సిరివెన్నెల సీతారామా శాస్త్రికి ఒక ముద్దు” అనే శీర్షికతో వీడియోని విడుద‌ల చేశాడు. దాదాపు 5 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రామ్ గోపాల్ వ‌ర్మ సిరివెన్నెల సీతా రామా శాస్త్రి గురించి చెప్పి.. తర్వాత తన గొంతుతో పాట పాడాడు. సిరి వెన్నెల పేరులోనే త‌న ఆలోచ‌న విధానం ఉంద‌ని, వ్య‌క్తిగా ఆయనలో ఉన్న భావాల వ‌ల్లే మంచి మంచి పాటలు రాయగలిగారని అన్నారు.

“ఎప్పుడూ ఓప్పు కోవ‌ద్దురా ఓట‌మి” అంటూ సిరివెన్నెల రాసిన పాటను తానే స్వయంగా పాడి వినిపించారు రామ్ గోపాల్ వర్మ. ఈ పాటను RGV త‌న స్టైల్‌లో అద్భుతంగా ఆల‌పించారు. సిరి వెన్నెల సీతారామ శాస్త్రి ఫోటోకు కూడా ఈ సంధర్భంగా వర్మ ముద్దు పెట్టారు. రామ్ గోపాల్ వర్మ పాడిన ఈ పాట ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.