సుషాంత్ మాజీ లవర్ మహేశ్ భట్‌తో మెసేజెస్: హద్దుల్లేని మీ ప్రేమ నాపై ప్రభావం చూపిస్తుంది

సుషాంత్ మాజీ లవర్ మహేశ్ భట్‌తో మెసేజెస్: హద్దుల్లేని మీ ప్రేమ నాపై ప్రభావం చూపిస్తుంది

సుషాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో లేటెస్ట్ డెవలప్ మెంట్స్ అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికకగా అభిమానులు, నెటిజన్లు సుషాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని రిక్వెస్ట్ చేశారు. దీనిపై సుప్రీం కోర్టు వారికి అనుకూలంగా స్పందిస్తూ కేసు సీబీఐని విచారించమంటూ ఆదేశించింది. ఇదే క్రమంలో ఓ న్యూస్ ఛానెల్ సుషాంత్ మాజీ లవర్ రియా చక్రవర్తికి ప్రముఖ ప్రొడ్యూసర్ మహేశ్ భట్ కు మధ్య జరిగిన వాట్సప్ చాట్ హిస్టరీని బయటపెట్టింది.

అవన్నీ జూన్ 8న జరిగిన సంభాషణలే. అదే రోజు రియా.. సుషాంత్ ను వదిలి దూరంగా వచ్చేసింది. ఈ చాటింగ్ గురించి వింటే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఏ సంబంధం లేనప్పుడు ఆ నిర్మాత రియా-సుషాంత్ ల రిలేషన్‌షిప్ గురించి ఎందుకు సలహాలిచ్చాడని ప్రశ్నిస్తున్నారు.

దాని కంటే ముందు జలేబి సినిమాలో రియా క్యారెక్టర్ పేరు ఆయేషా. అయితే ఆమె దీని గురించేమైనా నిర్మాతకు మెసేజ్ చేసింది కాబోలు. అసలు దానిలో ఏముందంటే.. ‘ఆయేషా బరువైన గుండెతో ఉండటం కంటే రిలీఫ్ కోసం ముందుకు సాగాలి. ఇదే నా చివరి వేకప్ కాల్. నువ్వు అప్పుడూ.. ఇప్పుడూ నా ఏంజిల్‌వే’ అనే అర్థం వచ్చేలా రియా మెసేజ్ చేసింది

దానికి మహేశ్ భట్ నుంచి వచ్చిన రెస్పాన్స్.. ‘వెనక్కు తిరిగి చూడకు. మీ తండ్రికి ఈ విషయం తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని మెసేజ్ చేశారు. దాని తర్వాత మెసేజ్ లలో రియా.. మహేశ్ తనకు చాలా ప్రేరణ ఇచ్చేలా మాట్లాడారని మనో ధైర్యాన్ని నింపినట్లు మెసేజ్ చేసింది. దాంతో పాటుగా వారిద్దరి దార్లు సినిమా కోసమే కాదని.. వేరే కారణం కోసం కలిశాయని అందులో రాసుకొచ్చింది.

ఆ చాటింగ్‌లో ఒక మెసేజ్‌లో ‘మీరు నాకు చెప్పిన ప్రతీ మాట. నాలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. మీ హద్దుల్లేని ప్రేమ నాపై చాలా ప్రభావమే చూపించింది’ అని చెప్తూ ఇప్పుడు తను రెక్కలు విప్పుకున్నట్లుగా ఫీల్ అవుతున్నట్లు రాసింది.