Kantara : కాంతారలో జరిగిన సంఘటన రిషబ్‌కి రియల్‌గా ఎదురైంది.. వైరల్ అవుతున్న వీడియో!

కాంతార ప్రీ క్లైమాక్స్ లో జరిగే సన్నివేశాన్ని రియల్ లైఫ్ లో రిషబ్ షీటీ ఎదురుకున్నాడు. అద్న్హుకు సంబంధించిన వీడియోని హోంబలే సంస్థ తమ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది.

Kantara : కాంతారలో జరిగిన సంఘటన రిషబ్‌కి రియల్‌గా ఎదురైంది.. వైరల్ అవుతున్న వీడియో!

Kantara

Kantara : కన్నడ పరిశ్రమ నుంచి ఇటీవల వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘కాంతార’. ఎటువంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి దేశం మొత్తాన్ని షేక్ చేసింది. కన్నడ దర్శకుడు మరియు నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కన్నడ గ్రామ దేవతల నేపథ్యంతో తెరకెక్కింది. కర్ణాటకలోని ప్రాచీన సంప్రదాయం అయిన ‘భూతకోల’ని దర్శకుడు రిషబ్ తెరకెక్కించిన తీరు అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లో రిషబ్ క్యారెక్టర్ ట్రాన్స్‌ఫార్మషన్ ఒక హైలైట్ అయితే.. మూవీ ఎండింగ్ లో భూతకోల ఆడే తీరు అందర్నీ కట్టపడేసింది.

Kantara : సర్‌ప్రైజ్.. ఆస్కార్ క్వాలిఫికేషన్స్ లిస్ట్ లో కాంతార.. రెండు విభాగాల్లో పోటీకి..

ఈ సీన్ లో ప్రజల భూమిని కాపాడినందుకు రిషబ్.. అక్కడే ఉన్న పోలీస్ అధికారి మరియు ఇతర గ్రామస్థుల చేతులు పట్టుకొని గుండె మీద పెట్టుకొని కృతజ్ఞత తెలియజేసే సన్నివేశం ప్రేక్షకుల గుండెకు హత్తుకుంది. ఇప్పుడు అదే సీన్ రిషబ్ శెట్టికి రియల్ గా ఎదురైంది. ఇటీవల జరిగిన ఒక పుంజుర్లీ ఉత్సవానికి రిషబ్, హోంబలే నిర్మాతలు హాజరయ్యారు. ఆ ఉత్సవంలో పుంజుర్లీ ఆవహించిన భూతకోల ఆడే వ్యక్తి.. రిషబ్‌ శెట్టి చేతులు ఆత్మీయంగా పట్టుకున్న సన్నివేశం అందర్నీ అబ్బురపరిచింది.

ఇందుకు సంబంధించిన వీడియోని హోంబలే సంస్థ తమ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ.. ‘ప్రకృతికి కట్టుబడి జీవితంలో మనకి విజయాన్ని మరియు స్వేచ్ఛను ప్రసాదించే దేవుడిని ఆరాధించండి. కాంతార చిత్ర బృందం రియల్ లైఫ్ లో కూడా దైవానుగ్రహం పొందింది’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. సినిమాలో జరిగిన విధం గానే నిజ జీవితంలో కూడా జరగడం. ఆ సన్నివేశాలు చూసిన ఆడియన్స్ కి గూస్ బంప్స్ వస్తున్నాయి. కాగా ఈ సినిమా ఆస్కార్ క్వాలిఫికేషన్స్ లిస్ట్ లో కూడా స్థానం దక్కించుకుంది.