Rishab Shetty : మీరు చూసింది కాంతార 2.. ఇప్పుడు కాంతార 1 తీస్తాను.. సర్‌ప్రైజ్ ఇచ్చిన రిషబ్ శెట్టి..

కాంతార సినిమాని ప్రేక్షకులతో పాటు అన్ని పరిశ్రమల సెలబ్రిటీలు కూడా మెచ్చుకున్నారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో కాంతార సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. చిత్ర నిర్మాత కూడా దీనికి పార్ట్ 2 ఉంటుందని చెప్పారు. దీంతో అంతా కాంతార సినిమాకి నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు................

Rishab Shetty : మీరు చూసింది కాంతార 2.. ఇప్పుడు కాంతార 1 తీస్తాను.. సర్‌ప్రైజ్ ఇచ్చిన రిషబ్ శెట్టి..

Rishab Shetty shares about interesting thing on Kantara Movie sequel

Rishab Shetty :  కన్నడలో రిషబ్ శెట్టి హీరోగా సప్తమి గౌడ హీరోయిన్ గా రిషబ్ శెట్టి దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా కాంతార. చిన్న సినిమాగా రిలీజయి కన్నడలో విజయం సాధించిన అనంతరం దేశమంతటా విడుదల అయి భారీ విజయం సాధించింది. కేవలం 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార సినిమా 450 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

కాంతార సినిమాని ప్రేక్షకులతో పాటు అన్ని పరిశ్రమల సెలబ్రిటీలు కూడా మెచ్చుకున్నారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో కాంతార సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. చిత్ర నిర్మాత కూడా దీనికి పార్ట్ 2 ఉంటుందని చెప్పారు. దీంతో అంతా కాంతార సినిమాకి నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంతార సీక్వెల్ పై హీరో రిషబ్ శెట్టి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.

Brahmanandam : అప్పటి చదువులు ఇప్పుడు లేవు.. గురువులకు గౌరవం ఇవ్వట్లేదు.. విద్యావ్యవస్థపై బ్రహ్మానందం వ్యాఖ్యలు..

రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. మీరు చూసింది కాంతార 2. త్వరలో కాంతార 1 తీస్తాను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు వచ్చిన కాంతార సినిమాకి సీక్వెల్ కాదు ప్రీక్వెల్ చెయ్యబోతున్నాము అని తెలిపి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. దీంతో ప్రేక్షకులు ఇప్పుడు చూసింది కాంతార 2నా అనుకుంటూ మరి కాంతార 1లో ఏం స్టోరీ చూపిస్తారో అని ఎదురు చూస్తున్నారు.