బామ్మ ఫీట్స్.. ఫిదా అయిన బాలీవుడ్ హీరో..

  • Published By: sekhar ,Published On : July 24, 2020 / 03:25 PM IST
బామ్మ ఫీట్స్.. ఫిదా అయిన బాలీవుడ్ హీరో..

కరోనా కష్టకాలంలో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూటగడవని పేదవారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పొట్ట పోసుకోవడానికి నానా బాధలు పడుతున్నారు. తాజాగా ఓ బామ్మ క‌డుపు నింపుకోవ‌డం కోసం క‌ర్ర‌తో రోడ్లమీద విన్యాసాలు చేస్తుంది. ఓ ప్రాంతంలో ఆమె క‌ర్ర‌తో విన్యాసాలు చేస్తుండ‌గా ఎవ‌రో వీడియో తీసి ఆ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైర‌ల్ అయ్యింది. Warrior Aajiఈ వీడియో చూసి ఫిదా అయిన బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. యోధురాలైన ఈ బామ్మగారి వివ‌రాల‌ను ఇవ్వండ‌ని నెటిజ‌న్స్‌ను కోరారు రితేశ్‌. కొంద‌రు నెటిజ‌న్స్ రితేశ్‌కు ఆమె పేరు శాంతాభాయి అని ఆమెకు గ‌తంలో తాము కూడా సాయ‌ప‌డ్డ‌మంటూ కొన్నిఫోటోలు కూడా షేర్ చేశారు. వివ‌రాల‌ను తెలుసుకున్న రితేశ్ ఆ బామ్మకు సాయ‌ప‌డాలంటూ త‌న టీమ్‌ను ఆదేశించారు.