BiggBoss Non Stop : బిగ్‌బాస్ నుంచి ఆర్జే చైతూ అవుట్..

బిగ్‌బాస్ నాన్ స్టాప్ నుంచి మొదటి వారం ముమైత్ ఖాన్, రెండవ వారం శ్రీ రాపాక ఎలిమినేట్ అయ్యారు. తాజాగా మూడవ వారం అందరికంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న ఆర్జే చైతూ ఎలిమినేట్ అయ్యాడు.......

BiggBoss Non Stop : బిగ్‌బాస్ నుంచి ఆర్జే చైతూ అవుట్..

Rj Chaithu Bb

BiggBoss Non Stop :  బిగ్‌బాస్ నాన్ స్టాప్ మూడవ వారం కూడా పూర్తయింది. బిగ్‌బాస్ నాన్ స్టాప్ పేరుతో ఈ సారి ఓటీటీలో టెలికాస్ట్ అవుతున్నా అంతకు ముందు ఉన్న క్రేజ్ లేదు. కానీ బిగ్‌బాస్ అభిమానులు మాత్రం షోని తప్పకుండా ఫాలో అవుతున్నారు. ఇక అందులో ఉన్న కంటెస్టెంస్ట్ అభిమానులు మాత్రం వాళ్ళ కోసం షో చూస్తూ వాళ్ళకి ఓట్లు వేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ నాన్ స్టాప్ మూడు వారాలు పూర్తి చేసుకోగా ఇప్పటికే హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు.

బిగ్‌బాస్ నాన్ స్టాప్ నుంచి మొదటి వారం ముమైత్ ఖాన్, రెండవ వారం శ్రీ రాపాక ఎలిమినేట్ అయ్యారు. తాజాగా మూడవ వారం అందరికంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న ఆర్జే చైతూ ఎలిమినేట్ అయ్యాడు. మొదటి నుంచి కూడా చైతూ పైన నెగిటివ్ ఎక్కువగానే ఉంది. హౌస్ లో తనకిష్టమొచ్చినట్టు మాట మారుస్తూ అంతా నా ఇష్టం అంటూ ఉండటంతో ప్రేక్షకుల్లో కూడా చైతూ మీద అసహనం ఏర్పడింది. దీంతో ఈ సారి నామినేషన్స్ లో అందరికంటే తక్కువ ఓట్లు తెచ్చుకొని హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.

BiggBoss Non Stop : వన్ సెకండ్.. బిగ్‌బాస్ ఓటీటీలో ఓంకార్..

ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్ నుంచి బయటకి వచ్చి స్టేజి మీదకి నాగార్జున వద్దకు వచ్చాడు. తన ఎలిమినేషన్ పై ఆర్జే చైతూ విచారం వ్యక్తం చేస్తూ తన జర్నీ ఇంత తొందరగా ముగుస్తుందని ఊహించలేదన్నాడు. ఆ తర్వాత తన హౌస్ మేట్స్ కి సలహాలు ఇచ్చాడు. ఇక హౌస్ నుంచి వచ్చేటప్పుడు తనకు కెప్టెన్సీ ద్వారా దక్కిన బ్యాడ్జ్ ని అనిల్ రాథోడ్ కి ఇచ్చాడు. దీంతో హౌస్ లో ప్రస్తుతం 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

Rj Chaithu