Rj Surya – Inaya : ఇనయానే సూర్య వెంట పడుతుంది.. ఇనయాపై సీరియస్ అయిన ఆర్జే సూర్య లవర్..

తాజాగా సూర్య లవర్ బుజ్జమ్మ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఇనయాపై ఫైర్ అయింది. సూర్య లవర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..............

Rj Surya – Inaya : ఇనయానే సూర్య వెంట పడుతుంది.. ఇనయాపై సీరియస్ అయిన ఆర్జే సూర్య లవర్..

Rj Surya lover bujjamma fires on Inaya Sulthana

Rj Surya – Inaya :  బిగ్‌బాస్ ఆరో సీజన్ చక్కగా సాగుతుంది. ఎప్పటిలాగే గొడవలు, ఏడుపులు ఓ పక్క, రొమాన్స్, లవ్వాటలు మరోపక్క జరుగుతూనే ఉన్నాయి బిగ్‌బాస్ లో. బిగ్‌బాస్ రేటింగ్ పెంచుకోవడానికి హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య లవ్ ఉన్నట్టు, బాగా క్లోజ్ అవుతున్నట్టు, వాళ్ళ మధ్య రొమాంటిక్ గా ఏదన్నా జరిగేట్టు చూపిస్తారు. ఇదంతా స్క్రిప్టెడ్ అని తెలిసినా, రేటింగ్ పెంచుకోవడానికి అని తెలిసినా బయట ఈ షో చూసే కంటెస్టెంట్స్ అభిమానులు కానీ, కంటెస్టెంట్స్ కి సంబంధించిన వాళ్ళు కానీ దీన్ని విమర్శిస్తూ ఉంటారు.

బిగ్‌బాస్ టీఆర్పీ కోసం గత సీజన్ లో షణ్ముఖ్, సిరి మధ్యలో ఇలాంటి లవ్ ట్రాక్ నడిపి బయట పెద్ద గొడవలనే సృష్టించింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రోల్స్ తో రెచ్చిపోయారు. తాజాగా ఈ సీజన్ లో ఇనయా-సూర్య మధ్య ఈ లవ్ ట్రాక్ నడపడానికి చూస్తున్నారు. ఇప్పటికే షోలో ఇనయా డైరెక్ట్ గానే సూర్య అంటే తనకి క్రష్ అని చెప్పింది. హౌజ్ లోని కంటెస్టెంట్స్ కూడా ఇనయా-సూర్య మధ్య ఏదో నడుస్తుందని చెప్పారు. వాళ్లిద్దరూ కూడా దానికి తగ్గట్టే ఉంటున్నారు. ఇద్దరూ క్లోజ్ గా ఉండటం, ఒకరి ఒళ్ళో ఒకరు పడుకోవటం, తినిపించుకోవడం, హగ్ ఇచ్చుకోవటం.. ఇలా చాలా క్లోజ్ అవుతూ బయట ఉన్నవాళ్ళకి కావాల్సినంత స్టఫ్ ఇస్తున్నారు. అయితే బిగ్‌బాస్ హౌజ్ లోకి వచ్చిన కొత్తలో సూర్య తనకి లవర్ ఉందని, తన పేరు బుజ్జమ్మ అని చెప్పాడు. ఇప్పుడు అది మర్చిపోయి ఇనయాతో క్లోజ్ గా ఉండటంతో షో కోసం అయినా కూడా విమర్శలు వస్తున్నాయి.

BiggBoss 6 Day 41 : హౌస్ లో గుడ్ ఎవరు బ్యాడ్ ఎవరు?? ఎలిమినేషన్స్ నుంచి నాగార్జున ఎవర్ని సేవ్ చేశారు??

తాజాగా సూర్య లవర్ బుజ్జమ్మ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఇనయాపై ఫైర్ అయింది. సూర్య లవర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”బుజ్జమ్మ అనేపేరు నాకు సూర్యనే పెట్టాడు. మేమిద్దరం పదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. సూర్య హౌజ్ లో బాగానే ఆడుతున్నాడు. సూర్య, ఆరోహి ఇద్దరూ ఒకచోట కలిసి పనిచేశారు కాబట్టి వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం నాకు తెలుసు. ఆరోహి వెళ్ళిపోయాక సూర్య డల్ అయ్యాడు. దీంతో ఇనయానే సూర్యకి దగ్గరైంది. ఇనయా కావాలనే సూర్య చుట్టూ తిరుగుతుంది. సూర్యకి ఫెవికాల్ లా అతుక్కుపోతుంది. సూర్య ఏం తప్పు చెయ్యట్లేదు. ఇనయా గేమ్ వదిలేసి సూర్య మీద ఎందుకు పడుతుందో నాకు తెలీదు” అని అంది. దీంతో ఇనయా ఫ్యాన్స్ ఈ బుజ్జమ్మని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.