Rajashekar : సంక్రాంతి బరిలో రాజశేఖర్? స్టార్ హీరోలతో పోటీ?

మలయాళంలో భారీ విజయం సాధించిన 'జోసెఫ్' సినిమాని తెలుగులో హీరో రాజశేఖర్‌ రీమేక్ చేస్తున్నారు. 'శేఖర్' పేరుతో ఈ సినిమా తెలుగులో రాబోతుంది. అయితే ఈ సినిమా ఇటీవలే షూటింగ్ కంప్లీట్

Rajashekar : సంక్రాంతి బరిలో రాజశేఖర్? స్టార్ హీరోలతో పోటీ?

New Project (1)

Rajashekar :  తెలుగు వాళ్ళకి సంక్రాంతి అంటే పెద్ద పండుగ. ఇంటిల్లిపాది పండుగని ఆనందంగా చుట్టాలతో, స్నేహితులతో జరుపుకుంటారు. తెలుగు వాళ్ళతో పాటు తెలుగు సినిమాలకి కూడా సంక్రాంతి పెద్ద పండుగే. స్టార్ హీరోలంతా సంక్రాంతికి తమ సినిమా రిలీజ్ చేసి విజయం సాధించాలని చూస్తారు. సంక్రాంతికి సెలవులు, కుటుంబం అంతా ఒకే చోట ఉండటంతో సినిమాలకి వెళ్తారు. ఎన్నో సంవత్సరాలుగా సంక్రాంతి అంటే పెద్ద హీరోల సినిమాలు, వాటి మధ్య పోటీ సహజం అయిపోయింది.

Puneeth Rajkumar : పునీత్ సమాధి సందర్శనానికి అనుమతి

2022 సంక్రాంతికి కూడా పోటీ గట్టిగానే ఉండబోతుంది. సంక్రాంతి మూడు రోజులకు మూడు సినిమాలు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ‘రాధేశ్యామ్‌’, ‘భీమ్లానాయక్‌’, ‘సర్కారు వారి పాట’ సినిమాలు సంక్రాంతి బరిలో ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అవ్వనున్నాయి. ఇవి ప్రకటించిన తర్వాత వీటన్నిటికీ పోటీగా ‘ఆర్ఆర్ఆర్’ కూడా సంక్రాంతికి రిలీజ్ అని బాంబు పేల్చాడు రాజమౌళి. అయితే సంక్రాంతికి ఒక వారం ముందే జనవరి 7న రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ పోటీలో ఉండటంతో మిగిలిన సినిమాల నిర్మాతలు రిలీజ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. వీటికి తోడు చిన్న చిన్న సినిమాలు కూడా ఒకటో రెండో ఉంటాయి. ఇప్పటికే ఉన్న పోటీ చాలదన్నట్టు తాజాగా మరో హీరో సంక్రాంతి రేసుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది.

Bigg Boss 5 : స్పెషల్ పవర్ తో నామినేషన్స్ నుంచి వీళ్ళు సేఫ్

మలయాళంలో భారీ విజయం సాధించిన ‘జోసెఫ్’ సినిమాని తెలుగులో హీరో రాజశేఖర్‌ రీమేక్ చేస్తున్నారు. ‘శేఖర్’ పేరుతో ఈ సినిమా తెలుగులో రాబోతుంది. అయితే ఈ సినిమా ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలు పెట్టింది. దీంతో ఈ సినిమాని కూడా సంక్రాంతి బరిలో నిలపాలని ఆలోచిస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి స్టార్ హీరోల సినిమాలకు పోటీగా, ‘ఆర్ఆర్ఆర్’కి పోటీగా రాజశేఖర్ వస్తారో వెయిట్ చేస్తారో చూడాలి.