Rajashekar : ‘గరుడవేగ’ సినిమాకి సీక్వెల్ చేసే ప్లాన్‌లో ఉన్నాను

రాజశేఖర్ మాట్లాడుతూ.. నా సినిమాల్లో 'గరుడ వేగ'కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ సినిమాలో అన్నీ అంశాలు బాగా కుదిరాయి. నా బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్ర కావడం వలన జనంలోకి.......

Rajashekar : ‘గరుడవేగ’ సినిమాకి సీక్వెల్ చేసే ప్లాన్‌లో ఉన్నాను

Garuda Vega

Rajashekar :  హీరో రాజశేఖర్ ప్రస్తుతం తన 91వ సినిమా శేఖర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. మలయాళం సినిమా ‘జోసెఫ్’కి రీమేక్ గా ‘శేఖర్’ని తెరకెక్కించారు. జీవిత రాజశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించింది. రాజశేఖర్ కూతురు శివాని ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది ఈ సినిమా. ఈ సినిమాని రాజశేఖర్ పుట్టినరోజు ఫిబ్రవరి 4న రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్ర బృందం. ప్రస్తుతం వరుస టీవీ షోలకి, ఇంటర్వ్యూలకి హాజరవుతూ సినిమా ప్రమోషన్స్ ని చేస్తున్నారు.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్ మాట్లాడుతూ.. నా సినిమాల్లో ‘గరుడ వేగ’కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ సినిమాలో అన్నీ అంశాలు బాగా కుదిరాయి. నా బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్ర కావడం వలన జనంలోకి బాగా వెళ్లింది. నా కెరీర్ కి కూడా ఆ సినిమా చాలా ప్లస్ అయింది. ఆ సినిమాతో మళ్ళీ నా కెరీర్ గాడిలో పడింది. ‘గరుడ వేగ’ సినిమా నాకు చాలా స్పెషల్. ఇప్పటికే చాలా మంది ఆ సినిమాకి సీక్వెల్ చేస్తే బాగుంటుందని అంటున్నారు. త్వరలోనే ‘గరుడ వేగ 2’ చేసే అవకాశం ఉంది. దానికి తగ్గ కథని రెడీ చేస్తున్నారు” అని తెలిపారు.

Rajashekar : విలన్‌గా చేయడానికి నేను రెడీ : రాజశేఖర్

2017లో రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘PSV గరుడ వేగ’ సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.