Road Accident : బాలకృష్ణ ఇంటి గేటుని ఢీ కొట్టిన జీపు.. తృటిలో తప్పిన ప్రమాదం..

 హీరో నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 45 వద్ద ఉన్న ఆయన ఇంటివైపుకి వేగంగా ఓ జీపు దూసుకొచ్చి.................

Road Accident : బాలకృష్ణ ఇంటి గేటుని ఢీ కొట్టిన జీపు.. తృటిలో తప్పిన ప్రమాదం..

Balakrishna

Road Accident :  హీరో నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 45 వద్ద ఉన్న ఆయన ఇంటివైపుకి వేగంగా ఓ జీపు దూసుకొచ్చి బాలయ్య బాబు ఇంటి గేటుని ఢీకొట్టబోయి పక్కనే ఉన్న ఆయన ఇంటి గోడని, ఫెన్సింగ్, చెట్లని ఢీ కొట్టింది. వాటిని ఢీ కొట్టి బాలకృష్ణ ఇంటి గేటు వద్ద ఆగిపోయింది. ఈ జీపుని ఓ యువతి డ్రైవ్ చేసింది.

Shivani Rajashekar : నా వల్ల నాన్నకి కరోనా వచ్చింది.. నా జాతకంలో దోషం ఉందని అందరూ అనేవారు..

బాలకృష్ణ ఇంటి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది అనేసరికి ఒక్కసారిగా జనాలు గుమిగూడారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పోలీసులకు విషయం తెలిసి వచ్చి ట్రాఫిక్ క్లియర్‌ చేసి వాహనాలను పంపించివేశారు. అనంతరం ఆ జీపు తోలిన యువతిని పోలీసులు ప్రశ్నించగా ఆ యువతి.. అంబులెన్స్‌కు దారి ఇచ్చే క్రమంలో జీపుని లెఫ్ట్ కి తీసుకోవడంతో అదుపు తప్పి ఇలా ఢీ కొట్టాను అని చెప్పినట్టు సమాచారం. ఈ యాక్సిడెంట్ లో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. జీపు ముందు భాగం మాత్రం డ్యామేజ్ అయింది.