Pushpa 2 : పుష్ప 2 ఆర్టిస్టులకు రోడ్డు ప్రమాదం.. షూటింగ్ కి వెళ్లొస్తుండగా..

నేడు తెల్లవారుజామున పుష్ప 2 సినిమాలో నటించిన పలువురు ఆర్టిస్టులు షూటింగ్ ముగించుకున్న అనంతరం ఓ ప్రైవేట్ బస్సులో హైదరాబాద్ కు వస్తున్నారు.

Pushpa 2 : పుష్ప 2 ఆర్టిస్టులకు రోడ్డు ప్రమాదం.. షూటింగ్ కి వెళ్లొస్తుండగా..

Road Accident to Pushpa 2 Movie artists near NarketPalle

Road Accident :  అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ అయిపోయాయి. తాజాగా మూడో షెడ్యూల్ అయిపోయినట్టు సమాచారం. పుష్ప 2 షూటింగ్ ముగించుకొని వస్తున్న ఆర్టిస్టులకు రోడ్డు ప్రమాదం జరిగింది.

నేడు తెల్లవారుజామున పుష్ప 2 సినిమాలో నటించిన పలువురు ఆర్టిస్టులు షూటింగ్ ముగించుకున్న అనంతరం ఓ ప్రైవేట్ బస్సులో హైదరాబాద్ కు వస్తున్నారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై నార్కెట్పల్లి శివార్లలో ఆగి ఉన్న ఓ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఈ ప్రైవేట్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు భాగాలు డ్యామేజ్ అయ్యాయి. ఇద్దరికి తీవ్ర గాయాలు, పలువురికి స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం. గాయాలు అయిన ఆర్టిస్టులను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు.

Dhanush : ముంబైలో ధనుష్.. ఇలా మారిపోయాడేంటి.. వైరల్ అవుతున్న ధనుష్ కొత్త లుక్..

ఈ రోడ్డు ప్రమాదంతో హైవేపై కొద్ది సేపు ట్రాఫిక్ జామ్ నెలకొంది. విషయం తెలుసుకొని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసి విచారిస్తున్నారు. పుష్ప 2 ఆర్టిస్టులు ఉన్న బస్సుకి యాక్సిడెంట్ అవ్వడం, ఇద్దరికి గాయాలు అవ్వడంతో పుష్ప చిత్రయూనిట్ కంగారు పడుతున్నారు. ఘటనపై ఆరా తీస్తున్నారు. ఈ యాక్సిడెంట్ పై మరింత సమాచారం రావాల్సి ఉంది.