Devi Sri Prasad: రఫ్పాడిస్తున్న రాక్ స్టార్.. డిఎస్పి బౌన్స్ బ్యాక్ అయినట్లేనా? Rocking rock star Devi Sri Prasad bouncing back with musical hit movies

Devi Sri Prasad: రఫ్పాడిస్తున్న రాక్ స్టార్.. డిఎస్పి బౌన్స్ బ్యాక్ అయినట్లేనా?

రాక్ స్టార్ డిఎస్పి మళ్లీ రఫ్పాడిస్తున్నాడు.. మధ్యలో కాస్త ఢల్ అయినా, పుష్పతో అందరి ఫ్యూజ్ లు ఎగిరిపోయేటట్టు చేశాడు. ఆ వుడ్ ఈ వుడ్ అని కాదు, అన్ని భాషల్లో డిఎస్పి మ్యాజిక్...

Devi Sri Prasad: రఫ్పాడిస్తున్న రాక్ స్టార్.. డిఎస్పి బౌన్స్ బ్యాక్ అయినట్లేనా?

Devi Sri Prasad: రాక్ స్టార్ డిఎస్పి మళ్లీ రఫ్పాడిస్తున్నాడు.. మధ్యలో కాస్త ఢల్ అయినా, పుష్పతో అందరి ఫ్యూజ్ లు ఎగిరిపోయేటట్టు చేశాడు. ఆ వుడ్ ఈ వుడ్ అని కాదు, అన్ని భాషల్లో డిఎస్పి మ్యాజిక్, మ్యూజికల్ లవర్స్ ను మెస్మరైజ్ చేస్తుంది. చాలా రోజుల తర్వాత అన్ని సూపర్ హిట్ పాటలే ఇచ్చి, రీసెంట్ టైమ్ లో పుష్ప ఆల్బమ్ ను టాప్ లో నించోబెట్టాడు.

Summer Releases: స్టార్లంతా సమ్మర్ బరిలోనే.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్కా!

సినిమా సక్సెస్ కు స్టార్స్, డైరెక్టర్స్ ఎంత ముఖ్యమో మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంతే కీలకం. కొందరి వేవ్ లెంగ్త్ కుదిరి, కాంబినేషన్ బాగా వర్కవుట్ అవుతుంది. బన్నీ, సుకుమార్ తో డిఎస్పీ కలిస్తే, అది పక్కా మ్యూజికల్ హిట్టే. వీళ్ల కాంబినేషన్లో ఆర్య, ఆర్య2 తర్వాత హాట్రిక్ సినిమాగా వచ్చింది పుష్ప. దాంతో ఆడియన్స్ లోనూ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా పుష్ప నుంచి ఒక్కొక్క పాటను విడుదల చేస్తుంటే, ప్రేక్షకులకు పూనకాలే వచ్చాయి.

Pushpa: శ్రీవల్లి పాటకి ప్రధాని నరేంద్ర మోడీ స్టెప్పులేస్తే?!

స్టార్స్ మధ్య సక్సెస్ వార్ ఉన్నట్టే మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య హెల్తీ పోటీ ఉంటుంది. ఈ మధ్య కాలంలో భారీ కమర్షియల్ సినిమాలకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మ్యూజిక్ చేస్తున్న టాప్ మోస్ట్ సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్, తమన్ లు ముందు వరసలో ఉంటారు. వీళ్లిద్దరి మధ్య పోటీ ఎప్పటికప్పుడు రసవత్తరంగానే ఉంటుంది. రీసెంట్ గా తమన్, స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కే అల వైకుంఠ పురం ఆల్బమ్ ఇచ్చి టాప్ వన్ ప్లేస్లోకి రేసు గుర్రంలా దూసుకపోయాడు. ఆ టైమ్ లో సరిలేరు నీకెవ్వరు హిట్ తోనే సరిపెట్టుకున్నారు దేవిశ్రీ ప్రసాద్. తమన్ కన్నా కాస్త వెనకబడ్డాడు. సినిమాలు కూడా తగ్గాయి. కొందరైతే దేవిశ్రీ ప్రసాద్ పనై పోయిందనుకున్నారు.

Lakaram Tank Bund: ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహం.. ఆవిష్కరణకు జూనియర్?

డిజిటల్ స్పాన్, స్మార్ట్ ఫోన్ కల్చర్ కలిసొచ్చి అల వైకుంఠపురం ఆల్బమ్ బిగ్గెస్ట్ వ్యూయర్ షిప్ ని సాధించింది. ఆ కిక్ తో తమన్ ట్యూన్స్ కు భాగా డిమాండ్ పెరిగింది. లేటెస్ట్ అఖండ లాంటి బిగ్ స్టార్ మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో హీరోయిజం ఎలివేషన్ అయిందని తమన్ ను ప్రశంసించారు చాలా మంది. కానీ, సాంగ్స్ ఆల్బమ్ ఆ రేంజ్ లో హిట్ కాలేదు. పుష్ప ఆల్బమ్తో సత్తా చాటాడు డిఎస్పి. అదే అల్లు అర్జున్ పుష్ప సినిమా క్రేజ్ ను పాన్ ఇండియా స్థాయికి లాక్కెళ్లాడు. పుష్ప ఈ రేంజ్లో సంచలనాలు క్రియేట్ చేస్తుందంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో చేసిన మాయ కీ రోల్ పోషించింది. పుష్ప ఆల్బం తక్కువ టైమ్ స్పాన్ లోనే అన్ని భాషల్లో కలిపి వన్ బిలియన్ ప్లస్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. డిఎస్పి బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

×