Rolex: ‘రోలెక్స్’ను సింగిల్‌గా దించుతున్న లోకేశ్..?

తమిళ యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తనదైన లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేసుకుని, అందులో వరుసగా సినిమాలు చేస్తూ ఇండియన్ ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నాడు. ఇప్పటికే ఖైదీ, విక్రమ్ సినిమాలతో లోకేశ్ ఈ సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాడు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌తో లోకేశ్ తెరకెక్కించిన విక్రమ్ మూవీ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

Rolex: ‘రోలెక్స్’ను సింగిల్‌గా దించుతున్న లోకేశ్..?

Rolex Character To Have A Solo Movie In Lokesh Cinematic Universe

Rolex: తమిళ యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తనదైన లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేసుకుని, అందులో వరుసగా సినిమాలు చేస్తూ ఇండియన్ ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నాడు. ఇప్పటికే ఖైదీ, విక్రమ్ సినిమాలతో లోకేశ్ ఈ సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాడు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌తో లోకేశ్ తెరకెక్కించిన విక్రమ్ మూవీ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

Suriya : రోలెక్స్ సర్‌కి రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్

ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను థ్రిల్ చేశాయి. అయితే ఈ సినిమాలోని క్లైమాక్స్‌లో ‘రోలెక్స్’ పాత్ర మాత్రం ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పాలి. ఈ పాత్రలో వర్సటైల్ యాక్టర్ సూర్య తనదైన మార్క్ విధ్వంసకరమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. దీంతో మళ్లీ రోలెక్స్ పాత్రను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే కోలీవుడ్ వర్గాల్లో దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది.

Lokesh Kanagaraj : ప్రభాస్ తమిళ డైరెక్టర్ కి ఛాన్సిచ్చాడా??

ప్రస్తుతం ఖైదీ-2, థళపతి 67, విక్రమ్-2 సినిమాలను తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్న లోకేశ్, త్వరలోనే రోలెక్స్ ప్రధానపాత్రగా ఓ సినిమాను చేసే ఆలోచనలో ఉన్నాడట. ఈ సినిమాలో రోలెక్స్ గురించే కథ ఉండబోతుంది. అయితే ఇది ఎప్పటికి పట్టాలెక్కుతుందో, ఎప్పుడు ఈ సినిమాను థియేటర్లలో చూస్తామో అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే రోలెక్స్ పాత్ర గురించి లోకేశ్ క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.