Romantic Movie : కొడుకు కోసం డైరెక్టర్స్ అందర్నీ దింపిన పూరి జగన్నాధ్

పూరి జగన్నాధ్ తనయుడి కోసం ఇండస్ట్రీలోని చాలా మంది డైరెక్టర్స్ ఈ సినిమా ప్రీమియర్ షోకి వచ్చి సినిమా చూసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

Romantic Movie : కొడుకు కోసం డైరెక్టర్స్ అందర్నీ దింపిన పూరి జగన్నాధ్

Puri

Romantic Movie :  డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన తనయుడిని హీరోగా నిలబెట్టేందుకు గట్టిగా ట్రై చేస్తున్నాడు. పూరీ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29న విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కువగానే చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ తో ట్రైలర్ లాంచ్ ఈవెంట్, విజయ్ దేవరకొండతో ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా జరిపించారు. ఇక సినిమా యూనిట్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ కి రెండు రోజుల ముందే ప్రీమియర్ వేసాడు పూరి.

Sherlin Chopra : శిల్పాశెట్టి దంపతులపై 75 కోట్ల పరువు నష్టం దావా వేసిన షెర్లిన్ చోప్రా

ఏఎంబీ మాల్ ఎమ్ లాంజ్ లో నిన్న రాత్రి రొమాంటిక్ స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. ఈ స్పెషల్ ప్రీమియర్ కి పూరికి సన్నిహితంగా ఉండేవాళ్ళందర్నీ పిలిచాడు. అంతే కాక స్టార్ డైరెక్టర్స్ అందర్నీ పిలిపించాడు. పూరి జగన్నాధ్ తనయుడి కోసం ఇండస్ట్రీలోని చాలా మంది డైరెక్టర్స్ ఈ సినిమా ప్రీమియర్ షోకి వచ్చి సినిమా చూసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ రకంగా కూడా పూరి గట్టిగా ప్రమోషన్ చేశాడు సినిమాని. ఈ ప్రీమియర్ కి రాజమౌళి, హరీష్ శంకర్, మెహర్ రమేష్‌, అనిల్ రావిపూడి, బాబీ, గోపీచంద్ మలినేని, వంశీ పైడిపల్లి, బొమ్మరిల్లు భాస్కర్, గుణశేఖర్ లు వచ్చి సినిమాని, ఆకాష్ ని ప్రమోట్ చేశాడు.

Pushpa : ‘సామి సామి’ అంటూ పుష్పరాజ్ తో చిందేసిన శ్రీవల్లి

వీళ్ళే కాకుండా హీరోలు విష్వక్సేన్, సత్యదేవ్.. ఇంకా కొంతమంది సినీ ప్రముఖులు ఈ ప్రీమియర్ కి వచ్చారు. మొత్తానికి పూరి తన సినిమా పరిధి మొత్తం వాడి సినిమాని, తన కొడుకుని బాగా ప్రమోట్ చేస్తున్నాడు. అదే రోజు నాగ శౌర్య ‘వరుడు కావలెను’ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కూడా ప్రమోషన్స్ కొత్తగా చేస్తుంది. మరి ఈ రెండు సినిమాలకి రేపు ఫలితం ఎలా వస్తుందో చూడాలి.