Roshan : రెండో చిత్రాన్ని గ్రాండ్‌గా ప్లాన్ చేసిన రోషన్..

తాజాగా రోషన్ హీరోగా రెండో సినిమాని అనౌన్స్ చేశారు. రెండో సినిమా కూడా భారీగానే ప్లాన్ చేసుకున్నాడు రోషన్. భారీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ సమర్పణలో స్వప్న సినిమాస్ రోషన్...

Roshan :  రెండో చిత్రాన్ని గ్రాండ్‌గా ప్లాన్ చేసిన రోషన్..

Roshan

Roshan :  ఒకప్పటి స్టార్ హీరో, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న శ్రీకాంత్ వారసుడు రోషన్ హీరోగా ఇటీవల ‘పెళ్లి సందD’ సినిమాతో ప్రేక్షకులని అలరించాడు. హీరోగా మొదటి ప్రయత్నంలోనే అందర్నీ మెప్పించాడు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రోషన్ సినిమా ఇండస్ట్రీలోకి తన ఎంట్రీ గ్రాండ్ గా ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చినా ఆచి తూచి ప్రాజెక్టుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు.

 

తాజాగా రోషన్ హీరోగా రెండో సినిమాని అనౌన్స్ చేశారు. రెండో సినిమా కూడా భారీగానే ప్లాన్ చేసుకున్నాడు రోషన్. భారీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ సమర్పణలో స్వప్న సినిమాస్ రోషన్ హీరోగా సినిమాని అనౌన్స్ చేసింది. ఇవాళ రోషన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు. స్వప్న సినిమాస్ బ్యానర్ లో 9వ సినిమాగా ఇది రాబోతుంది. ఈ చిత్రానికి ‘అద్వైతం’ అనే షార్ట్ ఫిలింతో జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు ప్రదీప్ దర్శకత్వం వహించనున్నారు.

Kandikonda : సొంతగ్రామంలో కందికొండ అంత్యక్రియలు..

ఇవాళ రిలీజ్ చేసిన పోస్టర్ లో రోషన్ టక్ చేసుకొని భుజానికి ఒక సంచి తగిలించుకొని ఉన్నాడు. పోస్టర్ చూస్తుంటేనే కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది.