‘రౌడీ బేబీ’ సౌత్ ఇండియాలో సరికొత్త రికార్డ్!

10TV Telugu News

Rowdy Baby 1 Billion Views: తమిళ స్టార్ ధనుష్, మలయాళ బ్యూటీ సాయి పల్లవి జంటగా, బాలాజీ మోహన్ డైరెక్షన్‌లో, ‘మారి’ కి సీక్వెల్‌గా వచ్చిన సినిమా ‘మారి 2’. ఈ మూవీలో ‘రౌడీ బేబీ’ పాట ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సాంగ్ సౌత్ ఇండియాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.


ఏకంగా 1 బిలియన్ (అక్షరాలా 100 కోట్లు) వ్యూస్ సాధించిన మొట్టమొదటి వీడియో సాంగ్‌గా ‘రౌడీ బేబీ’ రికార్డ్ నెలకొల్పింది. 2019 జనవరి 2న ‘రౌడీ బేబీ’ వీడియో సాంగ్‌ని అఫీషియల్‌గా అప్‌లోడ్ చేసారు మేకర్స్. కేవలం రెండు రోజుల్లోనే కోటికి పైగా వ్యూస్ తెచ్చుకుని ఆ సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూ.. ఇప్పుడు ఏకంగా 1 బిలియన్‌కు పైగా వ్యూస్, 3.9 మిలియన్లకు పైగా లైక్స్ రాబట్టింది.


యువన్ శంకర్ రాజా మ్యూజిక్, ధనుష్ రాసిన క్యాచీ లిరిక్స్‌, ధనుష్, ధీ వాయిస్‌తో పాటు ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభు దేవా, జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ ఈ పాటను వేరే లెవల్‌కి తీసుకెళ్లాయి. ఇక సాయి పల్లవి స్టెప్స్ అయితే ఇరగ దీసేసింది.హీరోయిన్ కాకముందు పలు డ్యాన్స్ షోలలో పార్టిసిపేట్ చేసిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఈ సాంగ్‌లో ధనుష్‌తో కలిసి దుమ్ము దులిపేసింది. కొన్ని కొన్ని చోట్ల ధనుష్‌ని కూడా డామినేట్ చేసేసింది. ‘కొలవెరి’, ‘రౌడీ బేబీ’ పాటలతో సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు ధనుష్.

10TV Telugu News