Liger: అభిమానులకు డబుల్ సర్ప్రైజ్ ఇచ్చిన రౌడీహీరో!

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు రౌడీబాయ్. ఒకటి కాదు.. డబుల్ బొనాంజ ట్రీట్ ఇచ్చాడు. రిలీజ్ డేట్ పై ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఆగి ఆగి అచ్చొచ్చిన నెలలోనే..

Liger: అభిమానులకు డబుల్ సర్ప్రైజ్ ఇచ్చిన రౌడీహీరో!

Liger

Liger: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు రౌడీబాయ్. ఒకటి కాదు.. డబుల్ బొనాంజ ట్రీట్ ఇచ్చాడు. రిలీజ్ డేట్ పై ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఆగి ఆగి అచ్చొచ్చిన నెలలోనే వచ్చేందుకు ఫిక్సయ్యాడు. అదీ అర్జున్ రెడ్డి ట్రాక్ లో అభిమానులను డబుల్ సర్ ప్రైజ్ చేసేందుకు వచ్చేస్తూ విజయ్ దేవరకొండ లైగర్ మోస్ట్ అవైటైడ్ అప్ డేట్స్ ను రివీల్ చేసాడు. పూరీ – రౌడీబాయ్ కాంబో లైగర్… 2022 ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న లైగర్… తెలుగుతో పాటూ హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరో స్పెషల్ న్యూస్… లైగర్ మూవీ గ్లింప్స్ డిసెంబర్ 31న విడుదల కానుంది. ఈ కొత్త సంవత్సరం… మంట పుట్టిద్దాం అంటూ ఇప్పుటినుంచే ఇలా ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేసింది లైగర్ టీమ్.

Pushpa: The Rise: పుష్ప: ది రైజ్.. రివ్యూ

విజయ్ దేవరకొండకు మాంచి కిక్కించిన మూవీ అర్జున్ రెడ్డి రిలీజైంది కూడా ఆగస్ట్ 25నే. అంతేకాదు రౌడీ బాయ్ మరో హిట్ గీతగోవిందం కూడా ఆగస్ట్ నెలలోనే రిలీజైంది. సో ఈమధ్య సాలిడ్ హిట్ లేని విజయ్ దేవరకొండ తనకు కలిసొచ్చిన నెల ఆగస్ట్ నే… మరీ ముఖ్యంగా తనను నేషనల్ స్టార్ చేసిన అర్జున్ రెడ్డి డే ఆగస్ట్ 25నే లైగర్ డేట్ గా ఫిక్స్ చేసుకున్నాడు. ఎలాగూ విజయ్, పూరీ, ఛార్మీతో కరణ్ జోహార్, అపూర్వ మెహతా వంటి బిగ్ ప్రొడ్యూసర్స్ కలిసి నేషనల్ వైడ్ క్రేజ్ తీసుకొచ్చారు. ఇక వీళ్లతో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ చేతులు కలిపాక తిరుగులేదని గట్టిగా డిసైడయ్యారు.

Puli Vachindi Meka Sachindi: పులొచ్చింది మేక చచ్చింది – రివ్యూ

మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న లైగర్ షూటింగ్ ఎండింగ్ కొచ్చేసింది. మైక్ టైసన్, విజయ్, అనన్య పాండేల మధ్య సీన్స్ ను రీసెంట్ గా అమెరికాలో పూర్తి చేసారు పూరీ జగన్నాథ్. ఇక మిగిలిన స్మాల్ షెడ్యూల్ ను ఇండియాలోనే ప్లాన్ చేస్తున్నారు. అటు సైమల్టేనియస్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రౌడీ ఫ్యాన్స్ కు హుషారిచ్చే డేట్స్ చెప్పి ఎక్జైట్ మెంట్ మరింత పెంచారు లైగర్ మేకర్స్.