RRR: 6 వారాల కలెక్షన్స్.. 600 దాటిన ఆర్ఆర్ఆర్!

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌కు ముందే ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించడం...

RRR: 6 వారాల కలెక్షన్స్.. 600 దాటిన ఆర్ఆర్ఆర్!

RRR

RRR: టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌కు ముందే ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించడం.. ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఆర్ఆర్ఆర్ ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

RRR: కొమురం భీముడో… వచ్చేస్తున్నాడో!

ఇక మార్చి 25న మొదలైన ఆర్ఆర్ఆర్ రికార్డుల వేట, నెలరోజులు పూర్తయినా ఆగడం లేదు. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్, కొమురం భీం పాత్రలో తారక్‌ల పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమా తాజాగా 6 వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని 7వ వారంలోకి అడుగుపెట్టింది.

RRR: చౌరస్తాలో ఆర్ఆర్ఆర్ ప్రభంజనం.. ఇప్పట్లో కష్టమే!

అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.1127 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా, షేర్ వసూళ్లలో రూ.605.78 కోట్ల మ్యాజిక ఫిగర్‌ను టచ్ చేసింది. ఇక త్వరలోనే ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటంతో ఈ చిత్రం టోటల్ రన్‌లో ఎంతమేర వసూళ్లు రాబడుతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఆర్ఆర్ఆర్ 6 వారాల వసూళ్ల వివరాలు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – రూ.111.41 కోట్లు
సీడెడ్ – రూ.50.88 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.34.88 కోట్లు
ఈస్ట్ – రూ.16.20 కోట్లు
వెస్ట్ – రూ.13.25 కోట్లు
గుంటూరు – రూ.18.08 కోట్లు
కృష్ణా – రూ.14.62 కోట్లు
నెల్లూరు – రూ.9.33 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.268.65 కోట్లు(షేర్) (రూ.406.45 కోట్లు గ్రాస్)
కర్ణాటక – రూ.44.18 కోట్లు
తమిళనాడు – రూ.38.42 కోట్లు
కేరళ – రూ.10.62 కోట్లు
హిందీ – రూ.132.80 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – రూ.9.15 కోట్లు
ఓవర్సీస్ – రూ.101.96 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – రూ.605.78 (షేర్) (రూ.1127 కోట్లు గ్రాస్)