OTT Pay For View: ఓటీటీలో చూసేందుకూ ఓ రేటు.. ఇక్కడా జేబుకి చిల్లేనా?

ముందస్తు ప్రోమోలు లేవు.. కనీసం పోస్టర్ అప్ డేట్ లేకుండానే కెజియఫ్ చాప్టర్ 2.. ప్రైమ్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చేసింది. ఇన్నిరోజులు రాఖీభాయ్ సినిమా కోసం వెయిట్ చేస్తోన్న స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ కి ప్రైమ్ పెద్ద షాక్ ఇచ్చింది. పే పర్ వ్యూ పద్ధతిలో..

OTT Pay For View: ఓటీటీలో చూసేందుకూ ఓ రేటు.. ఇక్కడా జేబుకి చిల్లేనా?

OTT Pay For View

OTT Pay For View: ముందస్తు ప్రోమోలు లేవు.. కనీసం పోస్టర్ అప్ డేట్ లేకుండానే కెజియఫ్ చాప్టర్ 2.. ప్రైమ్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చేసింది. ఇన్నిరోజులు రాఖీభాయ్ సినిమా కోసం వెయిట్ చేస్తోన్న స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ కి ప్రైమ్ పెద్ద షాక్ ఇచ్చింది. పే పర్ వ్యూ పద్ధతిలో రానున్న ట్రిపుల్ ఆర్ పైనే జనం విరుచుకుపడుతుంటే.. గుట్టు చప్పుడు కాకుండా వచ్చిన కెజియఫ్ కూడా అదే దందాను ఫాలో అవుతోంది.

OTT Release: గెట్ రెడీ.. ఈ వారం ఓటీటీలో రాబోయే సినిమాలివే!

అమెజాన్ ప్రైమ్.. కెజిఎఫ్ చాప్టర్ 2 స్ట్రీమింగ్ ప్రారంభించింది. ఉన్నట్టుండి సోమవారం నుంచి షో స్టార్ట్ చేసింది. ప్రోమోలు కానీ సోషల్ మీడియా హడావిడీ కానీ లేకుండానే సైలెంట్ గా రాఖీబాయ్ ప్రైమ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇక్కడో ఝలక్ ఇచ్చారు. చాప్టర్ 2ని చూడాలంటే ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఉంటే సరిపోదు. ఈ సినిమా కోసం అదనంగా 199 రూపాయలు కడితేనే ఆడియెన్స్ కు ప్రీమియర్ స్టార్ట్ అవుతుంది. అది కూడా రెండు రోజుల గడువుతో. ఇదే ఇక్కడ పెద్ద ట్విస్ట్. థియేటర్ కి వెళ్లడానికి టికెట్ కొనుకున్నట్టు.. ఓటీటీలో చూసేందుకు కూడా ఓ టికెట్ తీసుకోవాల్సిందే. ఇంట్లో కూర్చుని కూడా పే పర్ వ్యూ పద్ధతితో డబ్బులు వదలించుకోవాలి.

OTT Platforms: నువ్వా నేనా తేల్చుకుందాం.. ఆడియన్స్ కోసం ఓటీటీల పోటీ!

పే పర్ వ్యూ పద్ధతి పాలసీతో ట్రిపుల్ ఆర్ ను తీసుకొస్తున్నామని జీ5 ప్రకటించింది. మే 20 నుంచి ఆర్ఆర్ఆర్ స్ట్రీమింగ్ కానుంది. కానీ సేమ్.. జీ5 అకౌంట్ ఉన్నంతమాత్రాన ట్రిపుల్ ఆర్ ను చూడలేరు. సపరేట్ గా మనీ పే చేసి జక్కన్న సినిమాని చూడాలి. ఈ పద్ధతిపై ఓటీటీ ప్రేక్షకులు విరుచుకు పడుతున్నారు. ఇంతలా జనం నుంచి డబ్బులు దండుకోవాలా అని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.

OTT Platforms: ఓటీటీ వందల కోట్ల ఆఫర్స్.. హాట్ కేక్‌లా బిగ్ మూవీస్!

పేర్ పర్ వ్యూ విధానంలో ఆర్ఆర్ఆర్ వస్తున్నట్టు జీ5 ముందే చెప్పేసింది. జోరుగా ప్రచారం కూడా చేస్తోంది. అయితే అంత కన్నా ముందే కేజీఎఫ్ ను తీసుకొచ్చి ప్రైమ్ పక్కా స్ట్రాటజీని అమలుచేసింది. ఈ ఏడాది రిలీజ్ అయిన రెండు పెద్ద సినిమాలివి. థియేటర్ కి వెళ్లలేకపోయిన వారు ఓటీటీలో చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. అయితే అందరూ రెండు సినిమాలపై డబ్బులు ఖర్చు పెట్టలేరు. ఏదో ఒక మూవీకి 200 అంటే పర్లేదు అనుకోవచ్చు. అలాంటప్పుడు ఆ అడ్వాంటేజ్ ని కెజియఫ్ కి వాడుకోవడంలో తెలివిగా వ్యవహరించారు. మాములుగా శుక్రవారం లేదంటే ఫెస్టివ్ డేస్ లో సినిమాలు స్ట్రీమింగ్ చేసే అమెజాన్ ప్రైమ్ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ని సోమవారం అది కూడా మధ్యాహ్న సమయంలో రిలీజ్ చేయడం షాకిచ్చేదే.

Star’s OTT Entry: హాట్ కేక్‌లా ఓటీటీ.. సై అంటున్న స్టార్స్!

ఇప్పటిదాకా 1200 కోట్ల గ్రాస్ వసూలు చేసి నార్త్ లో కేజీఎఫ్2 ఇంకా దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అటు ట్రిపుల్ ఆర్ లాంగ్ రన్ లో 1100 కోట్లను రాబట్టి సైలంటయింది. ఇప్పుడీ రెండు సినిమాలు ఓటీటీల్లోనూ పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. అయితే పే పర్ వ్యూ పద్ధతిపై మాత్రం జనం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎంత రుద్దుదామని చూసినా.. జేబులు ఖాళీ చేసుకోడానికి మేము సిద్ధంగా లేమంటున్నారు. పైగా మరికొన్ని రోజులాగితే ఫ్రీ వర్షన్ కూడా పెట్టేస్తారులే అని లైట్ తీసుకుంటున్నారు.

Theaters VS OTT: నువ్వా నేనా.. టైమ్ చూసి దెబ్బ కొడుతున్న ఓటీటీలు!

ఇప్పుడు పైరసీ సైట్లు కూడా ఓటీటీలకు పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి. ఎంత పోరాడినా పైరసీలో అన్ని రకాల వెర్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటిది అంత భారీ రేట్ ను పెట్టి భారీ సినిమాలను చూడాలంటే ఎంతమంది ముందుకొస్తారో అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒకవేళ ఇప్పటిదాకా ఈ సినిమాలను చూడని వాళ్లుంటే ఫ్యామిలీతో సహా ఇంట్లోనే షో వేద్దాంలే అనుకుంటే 200 పెట్టొచ్చోమే కానీ మిగిలిన రెగ్యులర్ సబ్ స్క్రైబర్స్ కు ఇది ఇబ్బందే.

OTT Release: థియేటర్ రిలీజ్ ఒక్కటే సినిమా.. టైమ్ చూసి దాడికి సిద్దమైన ఓటీటీలు!

గతంలో ఇదే పద్ధతిలో సల్మాన్ ఖాన్ రాధే సినిమా రిలీజ్ అయింది. అయితే కొవిడ్ టైమ్ లో థియేటర్స్ తో పాటూ సమానంగా జీ5లో పే పర్ వ్యూ విధానంలో ప్లే చేశారు. అంటే ఓ రకంగా అది డైరెక్ట్ రిలీజ్. అయినా సరే ఈ విషయంలో రాధే సక్సెస్ సాధించలేకపోయింది. అలాంటిది ఆల్రెడీ థియేటర్స్ లో వేలకోట్లు కొల్లగొట్టిన ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2 ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాయి. మరి ఓటటీలో కూడా కోట్లు రాబడతాయా.. రాధేలా డీలా పడుతాయో చూడాలి.