RRR: మరో రికార్డ్.. లండన్ బీఎఫ్‌ఐ ఐమాక్స్ స్క్రీన్‌పై ఆర్ఆర్ఆర్?

మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.. రౌద్రం రణం రుధిరం. వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ సినిమా ఈసారి ఎలాగైనా..

RRR: మరో రికార్డ్.. లండన్ బీఎఫ్‌ఐ ఐమాక్స్ స్క్రీన్‌పై ఆర్ఆర్ఆర్?

Rrr

RRR: మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.. రౌద్రం రణం రుధిరం. వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ సినిమా ఈసారి ఎలాగైనా వచ్చేస్తాం అంటూ ఓ ముహుర్తాన్ని కూడా ప్రకటించారు. మార్చి 25న ట్రిపుల్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది ఆర్ఆర్ఆర్. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రమోషన్ మొదలు పెట్టిన ఆర్ఆర్ఆర్ టీమ్ మార్చి రెండో వారం నుండి దేశమంతా చుట్టేసి ప్రమోషన్ కార్యక్రమాలను ప్లాన్ చేస్తుంది.

RRR: దుబాయ్‌లో ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా హాలీవుడ్ యాక్షన్ హీరో?

మన దేశంలో నార్త్ నుండి సౌత్ వరకు చుట్టేసి ప్లాన్ సిద్ధం చేస్తున్న ఆర్ఆర్ఆర్ టీమ్.. దుబాయ్ లో కనీవినీ ఎరుగని రేంజ్ లో మార్చి 15న ఓ భారీ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ ను తీసుకొచ్చి వరల్డ్ వైజ్ గా క్రేజ్ ని తీసుకురావాలన్న ప్లాన్ తో ఉన్నారట. అదలా ఉండగానే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది. లండన్ బీఎఫ్‌ఐ ఐమాక్స్ స్క్రీన్‌పై ఆర్ఆర్ఆర్ ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

RRR: 50 రోజుల్లో ఆర్ఆర్ఆర్.. పోస్టర్ తో కౌన్ డౌన్ స్టార్ట్!

బీఎఫ్ ఐ ఐమాక్స్ అంటే లండన్ లోని బిగ్గెస్ట్ స్క్రీనింగ్ థియేటర్. ఈ స్క్రీన్ పై ఆర్ఆర్ఆర్ ప్రిమియర్ షో ప్రదర్శించనున్నారట. లండన్ బిగ్గెస్ట్ ఐమాక్య్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా ప్రదర్శితం కాలేదు. బాలీవుడ్ బిగ్గెస్ట్ సినిమాలు కూడా ఇప్పటి వరకు ఈ స్క్రీన్ మీద ప్రదర్శించలేదు. అలా ప్రదర్శిస్తే ఇప్పుడు తొలి ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్ పేరు రికార్డు లిఖితం కానుంది.