RRR: అమెరికాలో ఆర్ఆర్ఆర్ రచ్చ.. విడుదలకు ముందే రికార్డులు!

ఇప్పుడు జాతీయ స్థాయిలో కాదు కాదు ఇండియన్స్ ఉన్న అన్ని దేశాలలో అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తున్న సినిమా పేరు ఆర్ఆర్ఆర్. రాజమౌళి మరో విజువల్ వండర్ గా తెరెకక్కుతున్న ఆర్ఆర్ఆర్..

RRR: అమెరికాలో ఆర్ఆర్ఆర్ రచ్చ.. విడుదలకు ముందే రికార్డులు!

Rrr

RRR: ఇప్పుడు జాతీయ స్థాయిలో కాదు కాదు ఇండియన్స్ ఉన్న అన్ని దేశాలలో అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తున్న సినిమా పేరు ఆర్ఆర్ఆర్. రాజమౌళి మరో విజువల్ వండర్ గా తెరెకక్కుతున్న ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందే అడుగుపెట్టిన ప్రతి చోట రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళ్తుంది. సినిమా విడుదలకు ఇంకా రెండు వారాల సమయం ఉండగానే అమెరికాలో ప్రీమియం షోల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవడం.. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా సరికొత్త రికార్డులను సృష్టించడం కూడా జరిగిపోయింది.

Avatar 2: సకుటుంబ సపరివార సమేతంగా రానున్న అవతార్-2

అమెరికా అంతటా ప్రధాన సినిమా చైన్ లు ముందస్తు బుకింగ్ లను తెరవగా.. ఇప్పటికే అమెరికాలో ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డులను సృష్టించింది. ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ టికెట్స్ తోనే వన్ మిలియన్ డాలర్లు రావడం విశేషం. ఇందుకు సంబంధించి ఆర్ఆర్ఆర్ టీమ్ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. సినిమా విడుదలకు రెండు వారాల సమయం ఉండగానే వన్ మిలియన్ డాలర్లు రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకూ ఏ భారతీయ సినిమాకి ఇలాంటి రెస్పాన్స్ రాకపోగా ఆర్ఆర్ఆర్ సెన్సేషన్ గా మారింది.

KGF2: ‘కేజీఎఫ్ 2’ రీషూట్.. వైరల్ అవుతున్న యష్ ఫోటోలు

ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలకు ముందే ఈ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టగా మున్ముందు ఇంకెన్ని రికార్డులని సాధిస్తుందో చూడాలి. ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించగా.. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు రూ.200 కోట్లతో డివివి దానయ్య నిర్మించారు.