RRR Collections : అమెరికా, ఆస్ట్రేలియాలో కలెక్షన్ల సునామి.. విదేశాల్లో ‘ఆర్ఆర్ఆర్’ హవా..

అమెరికాలో ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా సృష్టించని రికార్డుని నెలకొల్పింది. సినిమా విడుదలకి ముందే ప్రీమియర్స్, తొలి రోజు కలెక్షన్లతో కలిపి 5 మిలియన్ డాలర్లకుపైగా..............

RRR Collections : అమెరికా, ఆస్ట్రేలియాలో కలెక్షన్ల సునామి.. విదేశాల్లో ‘ఆర్ఆర్ఆర్’ హవా..

Rrr Collections

 

RRR Collections :  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిన్న మార్చ్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు బెనిఫిట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకుంది. ఇప్పటివరకు తెలుగు సినిమాలు విడుదల అవ్వని దేశాల్లో కూడా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయి కొత్త రికార్డులని సృష్టించింది. దేశ విదేశాల్లో సినిమా రిలీజ్ అవ్వడం ఒక ఎత్తైతే విదేశాల్లో కూడా ‘ఆర్ఆర్ఆర్’కి భారీ కలెక్షన్లు రావడం మరో ఎత్తు.

సినిమా రిలీజ్ కి ముందే 450 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లని సాధించింది ‘ఆర్ఆర్ఆర్’. మన దేశంలో ఈ సినిమాకి కలెక్షన్స్ భారీగా వస్తాయని అందరూ ఊహించారు. ఊహించినట్టుగానే కేవలం మన దేశంలోనే మొదటి రోజు దాదాపు 100 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఇక విదేశాల్లో కూడా ఊహించని కలెక్షన్లు వచ్చాయి.

RRR : ఒకప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు పొగుడుతున్నారు.. చరణ్ పై బాలీవుడ్ ప్రశంసలు

అమెరికాలో ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా సృష్టించని రికార్డుని నెలకొల్పింది. సినిమా విడుదలకి ముందే ప్రీమియర్స్, తొలి రోజు కలెక్షన్లతో కలిపి 5 మిలియన్ డాలర్లకుపైగా వసూలు చేసింది. అంటే మన కరెన్సీ లో సుమారు 35 కోట్లు వసూలు చేసింది. ఒక్క అమెరికాలోనే 35 కోట్ల కలెక్షన్స్ అంటే మాములు విషయం కాదు.

ఇక కెనడాలో దాదాపు 2 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

యూకేలో దాదాపు 2 కోట్ల రూపాయలు పైగా రాబట్టింది.

ఇక తెలుగు సినిమాలకి అమెరికా తర్వాత మరో అతిపెద్ద ఓవర్సీస్ మార్కెట్ ఆస్ట్రేలియా. గతంలో ఆస్ట్రేలియాలో ‘అఖండ’ భారీ విజయం సాధించి కలెక్షన్లను రాబట్టింది. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్ట్రేలియాలో హాలీవుడ్ సినిమాల రికార్డులని కూడా తుడిచిపెట్టేసింది. ఆస్ట్రేలియాలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఏడు లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే దాదాపు 4 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది.

ఆస్ట్రేలియా పక్కనే ఉండే న్యూజిలాండ్ లో కూడా 69 వేలకు పైగా న్యూజిలాండ్ డాలర్లు అంటే దాదాపు 37 లక్షలకు పైగా వసూలు చేసింది.