RRR in Japan : RRR సరికొత్త రికార్డ్.. జపాన్ లో 100 రోజులు ఆడిన ఫస్ట్ ఇండియన్ సినిమా.. ఎన్ని సెంటర్స్ తెలుసా??

ఇప్పటికే కలెక్షన్స్ విషయంలో జపాన్ లో సరికొత్త రికార్డ్ సృష్టించింది RRR. జపాన్ లో అత్యధిక వసూళ్లు కలెక్ట్ చేసిన భారత చిత్రం గా నిలిచింది. దాదాపు 25 కోట్లు కొల్లగొట్టి జపాన్ లో ముత్తు, సాహో, బాహుబలి రికార్డులని బద్దలు కొట్టింది. తాజాగా RRR సినిమా మరో సరికొత్త రికార్డు..........................

RRR in Japan :  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కింది RRR సినిమా. ప్రపంచమంతా ఈ సినిమాని, దర్శకుడు రాజమౌళిని మెచ్చుకుంటుంది. మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా RRR సినిమా భారీ విజయం సాధించింది. RRR సినిమా దాదాపు 1200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమాకి పేరు ప్రఖ్యాతలు ప్రపంచమంతటా మారుమ్రోగిపోయాయి. హాలీవుడ్ లో అయితే రాజమౌళి టేకింగ్ కి స్టార్ టెక్నీషియన్స్ సైతం ఫిదా అయిపోయి అభినందించారు.

ఇప్పటికే RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ అవార్డుని వివిధ విభాగాల్లో గెలుచుకుంటుంది. ఇటీవలే RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్ దక్కించుకొని చరిత్ర సృష్టించింది. RRR సినిమా ప్రపంచమంతా విడుదలైంది. కొన్ని దేశాల్లో కొంచెం లేట్ గా రిలీజయింది. మూడు నెలల క్రితం RRR సినిమా జపాన్ లో భారీగా రిలీజ్ అయింది. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యామిలీలతో కలిసి వెళ్లి మరీ RRR సినిమాని జపాన్ లో ప్రమోట్ చేశారు. జపాన్ అభిమానులు మన వాళ్లపై విపరీతమైన ప్రేమ చూపించారు. కొన్ని రోజుల పాటు జపాన్ లో RRR సందడి వైరల్ గా మారింది. జపాన్ లో కూడా ఇక్కడ చేసినట్టే వీర లెవల్లో ప్రమోషన్స్ చేశారు. అక్కడి అభిమానులతో మాట్లాడారు. ఇప్పటికి కూడా జపాన్ నుంచి RRR పై ట్వీట్స్, పోస్టులు వస్తూనే ఉన్నాయి.

Pathaan : 3 రోజుల్లో 300 కోట్లు కొల్లగొట్టిన పఠాన్.. 2 రోజుల హాలిడేస్‌లో 500 కోట్ల మార్క్ అందుకుంటాడా?

ఇప్పటికే కలెక్షన్స్ విషయంలో జపాన్ లో సరికొత్త రికార్డ్ సృష్టించింది RRR. జపాన్ లో అత్యధిక వసూళ్లు కలెక్ట్ చేసిన భారత చిత్రం గా నిలిచింది. దాదాపు 25 కోట్లు కొల్లగొట్టి జపాన్ లో ముత్తు, సాహో, బాహుబలి రికార్డులని బద్దలు కొట్టింది. తాజాగా RRR సినిమా మరో సరికొత్త రికార్డు సెట్ చేసింది. ఇప్పుడున్న రోజుల్లో ఒక సినిమా థియేటర్స్ లో నెల రోజులు ఆడటమే గగనం, అలాంటింది 100 రోజులు అంటే కష్టమే. ఒకప్పుడు సినిమా 100 రోజులు, ఇన్ని సెంటర్లు అని రికార్డులు చెప్పేవారు. ఇప్పుడు అవి కనుమరుగైపోయాయి. కానీ RRR సినిమా జపాన్ లో 42 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు సెలబ్రేట్ చేసుకుంటుంది. 114 కేంద్రాల్లో షిఫ్టుల వారీగా ఆడి శత దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. దీంతో RRR ఎవరూ బీట్ చేయలేని సరికొత్త రికార్డుని, అది కూడా జపాన్ దేశంలో క్రియేట్ చేయడం విశేషం. ఈ రికార్డుతో జపాన్ లో ఫస్ట్ 100 రోజులు ఆడిన ఇండియన్ సినిమాగా కూడా రికార్డ్ సెట్ చేసింది RRR. ఈ విషయాన్ని అధికారికంగా రాజమౌళి కూడా పోస్ట్ చేశారు. ఏయే సెంటర్స్ లో ఆడుతుందో కూడా ఓ పోస్టర్ ద్వారా తెలియచేశారు. దీంతో చిత్రయూనిట్, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. RRR సినిమా రిలీజ్ అయి దాదాపు 10 నెలలు దాటుతున్నా ఇంకా ప్రపంచవ్యాప్తంగా దాని క్రేజ్ తగ్గట్లేదు. అంతా రాజమౌళి మహిమే.

ఈ విజయంపై రాజమౌళి ఎమోషనల్ గా ట్వీట్ చేస్తూ.. ఒకప్పుడు సినిమా 175 రోజులు, 100 రోజులు ఆడింది అని వినేవాళ్ళం. కానీ ఇప్పుడు బిజినెస్ ల వల్ల అలాంటివి వినట్లేదు. ఆ పథ జ్ఞాపకాలని మళ్ళీ జపాన్ అభిమానులు పరిచయం చేశారు. లవ్ యు, థ్యాంక్ యు జపాన్ అని పోస్ట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు