Student No 1 Movie : ‘RRR దోస్తీ’ గురించి రాజమౌళి 20 ఏళ్ల క్రితమే చెప్పాడా!

‘RRR దోస్తీ’ గురించి రాజమౌళి 20 సంవత్సరాల క్రితం ‘స్టూడెంట్ నెం.1’ సినిమాలోనే చెప్పారా?..

Student No 1 Movie : ‘RRR దోస్తీ’ గురించి రాజమౌళి 20 ఏళ్ల క్రితమే చెప్పాడా!

Rrr Dosti Song

Student No 1 Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం)..

RRR Release Date : రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతికి ముందే..

కొమ‌రం భీం పాత్ర‌లో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతా రామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ నటించారు. అలియాభట్, ఒలీవియా మోరిస్‌హీరోయిన్స్ కాగా అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని 2022 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించారు.

Samantha : 3 యూట్యూబ్ ఛానెళ్లపై సమంత పరువు నష్టం దావా

ఈరోజుల్లో సోషల్ మీడియా ఎంతగా డెవలప్ అయిందనే విషయం తెలిసిందే. ఒక సినిమాకి సంబంధించి ఓ చిన్న లింక్ దొరికినా సరే వదిలిపెట్టరు నెటిజన్లు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘దోస్తీ’ సాంగ్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ ‘దోస్తీ’ పాట గురించి జక్కన్న 20 సంవత్సరాల క్రితమే చెప్పారట.

 Student No 1

 

వివరాల్లోకి వెళ్తే.. రాజమౌళి దర్శకుడిగా పరిచయం అయిన సినిమా.. ఎన్టీఆర్, జక్కన్న ఇద్దరికీ కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన సినిమా ‘స్టూడెంట్ నెం.1’.. ఈ సినిమాలో ఫేర్‌వెల్ సందర్భంగా ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి’ అనే సాంగ్ వస్తుంది. ఆ పాటలో స్టేజ్ మీద ఉండే బ్యానర్ పైన ఫ్రెండ్ షిప్‌కి చిహ్నంగా షేక్ హ్యాండ్ గుర్తు ఉంటుంది.

 Student No 1 Song

‘ఆర్ఆర్ఆర్’ లోని దోస్తీ పాట అంతా కూడా ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో వస్తుంది. లిరికల్ వీడియో స్టార్టింగ్ నుంచి చివర్లో తారక్ – చరణ్ ఇద్దరూ చేతులు కలుపుకునే వరకు ప్రతి షాట్‌లోనూ దోస్తీ సింబల్ కనిపిస్తుంది. అంటే 20 సంవత్సరాల క్రితం జక్కన్న తన సినిమాలో ఓ పాటలో వాడిన దోస్తీ థీమ్ ఇప్పుడు మళ్లీ రిపీట్ అయ్యింది. ‘ఇది Coincidence ఆ, లేక Destination ఆ’ అంటూ నెట్టింట ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

RRR Dosti : ‘పులికి, విలుకాడికి’.. రామ్, భీమ్ ‘దోస్తీ’..