RRR : BAFTA అవార్డ్స్ నామినేషన్‌లో స్థానం దక్కించు కోలేకపోయిన RRR.. కారణం అదేనా?

రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' పలు అంటరాజాతియా అవార్డులను గెలుచుకుంటూ సత్తా చాటుతుంది. అయితే ఈ సినిమా బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ నామినేషన్స్ లో స్థానం దక్కించుకోవడంలో మాత్రం విఫలమైంది.

RRR : BAFTA అవార్డ్స్ నామినేషన్‌లో స్థానం దక్కించు కోలేకపోయిన RRR.. కారణం అదేనా?

rrr

RRR : రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు సృష్టిస్తుంది. ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఇండియన్ ఆడియన్స్ తో పాటు హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా పలు అంతర్జాతీయ అవార్డుల నామినేషన్స్ లో స్థానం దక్కించుకుంటూ వచ్చింది. అంతేకాదు హాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టి అవార్డులను కూడా సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (BAFTA) రేస్ లో ఈ సినిమా పాల్గొంది.

RRR : ఆస్కార్‍కి ఎంపిక చేయనందుకు బాధపడ్డా.. రాజమౌళి!

‘బెస్ట్ నాన్ ఇంగ్లీష్ పిక్చర్’ కేటగిరీలో చివరి ఐదు జాబితాల వరకు చేరుకున్న ఈ సినిమా. ఈ జాబితాలో స్థానం దక్కించుకోవడంలో మాత్రం విఫలమైంది. ప్రపంచం మొత్తం మెచ్చిన RRR ని నామినేషన్స్ లో లేకుండా చేయడంతో BAFTA పై నెటిజెన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే కొంతమంది దీని వెనుక ఉన్న కారణం గురించి మాట్లాడుతున్నారు. ఆర్ఆర్ఆర్ బిఫోర్ ఇండిపెండెన్స్ నేపథ్యంతో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ విలన్ బ్రిటిషర్స్.

బ్రిటిషర్స్ ని విలన్ గా చూపించడం వలనే RRR ని నామినేషన్స్ నుంచి తప్పించారు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ నామినేషన్స్ లో ఇండియా తరపు నుంచి ఉత్తమ డాక్యుమెంటరీ క్యాటగిరీ లిస్ట్ లో ‘ఆల్ దట్ బ్రీత్’ డాక్యుమెంటరీ ఫిలిం నామినేట్ అయ్యింది. ఇది ఇలా ఉంటే ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ గెలుచుకొనే అవకాశం ఉంది అంటూ అమెరికన్ న్యూస్ పేపర్స్ కథనాలు రాసుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ న్యూస్ మ్యాగజైన్ అయిన యూఎస్‌ఏ టుడే.. RRR ఆస్కార్ గెలుచుకొనే అవకాశం ఉంది అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ పక్కాగా గెలుచుకుంటుంది అంటూ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.