RRR : అమెరికాలో భారీగా ‘ఆర్ఆర్ఆర్’.. 1150 పైగా థియేటర్స్‌లో..

అమెరికాలో 'ఆర్ఆర్ఆర్' సినిమాని సరిగమ సినిమాస్, రాఫ్టర్ క్రియేషన్స్ కలిపి రిలీజ్ చేస్తున్నాయి. 'ఆర్ఆర్ఆర్' సినిమాని అమెరికాలో భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.....

RRR : అమెరికాలో భారీగా ‘ఆర్ఆర్ఆర్’.. 1150 పైగా థియేటర్స్‌లో..

Rrr America

 

RRR :  రాజమౌళి దర్శకత్వంలో డి.వి.వి. దానయ్య నిర్మాణంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియ, సత్యరాజ్ లతో పాటు హాలీవుడ్, వివిధ భాషల స్టార్స్ కూడా నటించారు. కరోనా కారణంగా ఇప్పటికే చాలా ఆలస్యం అయిన ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం మార్చ్ 25న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవ్వబోతుంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపొయింది. దేశంలోని అన్ని ఏరియాలతో పాటు ఓవర్సీస్ బిజినెస్ కూడా అయిపోవడం విశేషం. మన తెలుగు సినిమాలకి దేశం బయట పెద్ద మార్కెట్ ఉంది అమెరికాలోనే. మన ప్రతి సినిమా అమెరికాలో రిలీజ్ అవుతుంది. అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని సరిగమ సినిమాస్, రాఫ్టర్ క్రియేషన్స్ కలిపి రిలీజ్ చేస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని అమెరికాలో భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ ‘భీమ్లానాయక్’ నిర్మాతల చేతుల్లో..

అమెరికాలో మొత్తం 1150కి పైగా థియేటర్స్ లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని భారీగా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేయడంతో టికెట్స్ కూడా సేల్ అయిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా అమెరికాలో ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ సినిమాని ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అమెరికా ప్రీమియర్స్ ఒకరోజు ముందే అంటే మార్చ్ 24నే అక్కడి థియేటర్స్ లో ‘ఆర్ఆర్ఆర్’ పడనుంది. ఈ భారీ రిలీజ్ తో అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’ అత్యధిక కలెక్షన్స్ ని కూడా సాధిస్తుంది అంటున్నారు రిలీజ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్.