RRR : ‘ఆర్ఆర్ఆర్’ గే సినిమానా?? వాళ్ళకి ఇలా అర్థమైందా?? ఆర్జీవీ చెప్పింది నిజమేనా??

ఈసారి అవాక్కయ్యే విధంగా ఆర్ఆర్ఆర్ గురించి నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. తారక్, రామ్ చరణ్ కెమిస్ట్రీని చూస్తుంటే గే రొమాన్స్ లా అనిపిస్తుందని...........

RRR : ‘ఆర్ఆర్ఆర్’ గే సినిమానా?? వాళ్ళకి ఇలా అర్థమైందా?? ఆర్జీవీ చెప్పింది నిజమేనా??

RRR :  సోషల్ మీడియాలో మళ్ళీ ట్రెండ్ అవుతోంది ట్రిపుల్ ఆర్ సినిమా. అయితే ఈసారి అవాక్కయ్యే విధంగా ఆర్ఆర్ఆర్ గురించి నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. తారక్, రామ్ చరణ్ కెమిస్ట్రీని చూస్తుంటే గే రొమాన్స్ లా అనిపిస్తుందని కొందరు కామెంట్స్ చేస్తుంటే మీ వక్రబుద్ధిని మార్చుకొమ్మని ఇంకొంతమంది జక్కన్న మూవీని సపోర్ట్ చేస్తున్నారు. ఇలా దోస్తీ అని పాటేసుకుని, చరణ్ ని అన్న అని ఎన్టీఆర్ కొన్నిసార్లు పిలిచినా కూడా కొంతమంది ట్రిపుల్ ఆర్ లో గే రొమాన్స్ ను క్యాప్చర్ చేస్తున్నారు. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చాక, ఆపై యూఎస్ లో రీరిలీజ్ అయిన తర్వాత ఆర్ఆర్ఆర్ పై గే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాల నుంచి నెటిజన్స్ కొందరు తారక్, చరణ్ ల మధ్య గే రొమాన్స్ ను ఎంజాయ్ చేసినట్టు ట్వీట్స్ చేస్తున్నారు. అయితే భారతీయ సినిమా సక్సెస్ సాధించడం చూడలేకే ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటూ ట్రిపుల్ ఆర్ ఫ్యాన్స్ వాళ్లకి గట్టి కౌంటర్ ఇస్తున్నారు.

LGBT ప్రైడ్ మంత్ లో ఆర్ఆర్ఆర్ ను చూడటం హ్యాపీగా ఉందంటూ ట్వీట్ చేశారు కొందరు. కొంతమంది అయితే RRRలో వాళ్ళు పట్టుకున్న జెండా ప్లేస్ లో LGBT జెండాని పెట్టి మరీ ప్రమోట్ చేస్తున్నారు. సూపర్ యాక్షన్ రివేంజ్ డ్రామా కరెక్టే కానీ సేమ్ టైమ్ ఆర్ఆర్ఆర్ మనసును దోచే గే సినిమా అని ఎవరూ చెప్పలేదు ఎందుకు అంటూ మరొకరు కామెంట్ చేసారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల మధ్య కెమిస్ట్రీని వేరే స్టైల్ లో ప్రమోట్ చేస్తున్నారు. ఇక ట్రిపుల్ ఆర్ ప్రకటించినప్పుడే చరణ్, తారక్, రాజమౌళి ఉన్న ఫోటోపై గే కామెంట్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత కూడా అలాంటి సింప్టమ్సే కనిపిస్తున్నాయన్నాడు. ఇప్పుడు పశ్చిమ దేశాలు ఈ సినిమాను గే మూవీగా చూస్తున్నాయని తాను అనుకున్నది నిజమేనంటూ చెప్తున్నాడు.

Pawan Kalyan : పవన్ బాబాయ్ అంటూ.. జనసేన, టీడీపీపై మాట్లాడిన నందమూరి తారకరత్న..

‘ఆర్ఆర్ఆర్’ సినిమాను గే రొమాంటిక్ మూవీగా చూస్తున్నామనేవారిపై సపోర్టర్స్ విరుచుకుపడుతున్నారు. సినిమాలో స్వచ్ఛమైన స్నేహ బంధం కనబడలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఎవరు ఎలాంటి దృష్టితో చూస్తే అలానే కనిపిస్తారని గట్టిగా సమాధానం ఇస్తున్నారు. అయితే ఓటీటీలోకి వచ్చాక పెరిగిన చరణ్, తారక్ బైసెక్సువల్ కామెంట్స్ తో పాటూ సినిమాపై కూడా చాలామంది ఫారెనర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎటొచ్చి ఇద్దరు హీరోలు క్లోజ్ గా ఉన్న మూవ్ మెంట్స్ ను రొమాంటిక్ సీన్స్ గా మిస్ లీడ్ చేస్తున్నారన్న ఇబ్బందే ఇప్పుడు చరణ్, తారక్ ల అభిమానులను వెంటాడుతోంది.