KGF 2 : టీజర్స్‌తో ట్రెండ్ సెట్ చేస్తున్నారు..

‘కె.జి.యఫ్ 2’, ‘ఆర్ఆర్ఆర్’.. ఈ రెండు మోస్ట్ అవైటైడ్ ప్రాజెక్ట్స్ టీజర్స్‌తోనే చుక్కలు చూపిస్తున్నాయి..

KGF 2 : టీజర్స్‌తో ట్రెండ్ సెట్ చేస్తున్నారు..

Teasers

KGF 2: సినిమా రిలీజ్ కాకముందే రికార్డ్ కొట్టేస్తున్నారు. ఒకరిని మించి ఒకరు.. నువ్వా నేనా అనుకుంటున్నారు. అవును ‘కె.జి.యఫ్ 2’, ‘ఆర్ఆర్ఆర్’.. ఈ రెండు మోస్ట్ అవైటైడ్ ప్రాజెక్ట్స్ టీజర్స్‌తోనే చుక్కలు చూపిస్తున్నాయి. వార్ వన్ సైడ్ చేసేందుకు గట్టి ప్లాన్స్ వేస్తున్నాయి. రిలీజ్‌కు ముందు ఓ రికార్డ్.. రిలీజ్ తర్వాత మరో రికార్డ్.. ఇప్పుడీ సూత్రమే సినీ ఇండస్ట్రీలో ట్రెండై కూర్చుంది. టీజర్స్‌తోనే రికార్డు మోత మోగిస్తున్నాయి ఈ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమాలు.

మరీ ముఖ్యంగా ‘కె.జి.యఫ్ 2’, ‘ట్రిపుల్ ఆర్’, ‘పుష్ప’ లాంటి సినిమాల విషయంలో ఎప్పుడూ వినని సోషల్ మీడియా సక్సెస్ టాపిక్స్ తెరపైకొస్తున్నాయి. దుమ్మురేపే వ్యూస్‌తో పాన్ ఇండియా సినిమాలకు ‘కె.జి.యఫ్ 2’ చెమటలు పట్టిస్తుంటే.. హీరోల ఇంట్రడక్షన్ టీజర్స్‌తో పాటు అప్‌డేట్స్ రిలీజ్ చేస్తూ హవా కొనసాగిస్తోంది ‘ట్రిపుల్ ఆర్’. మరోవైపు ‘‘తగ్గేదేలే’’ అంటూ ‘పుష్ప’ దూసుకుపోతోంది.

జనవరి 7న యూట్యూబ్‌లో రిలీజైన ‘కె.జి.యఫ్ 2’ టీజర్‌ ఇప్పటిదాకా 202 మిలియన్లు అంటే 20 కోట్లకు పైగానే వ్యూస్‌సాధించింది. 8.5 మిలియన్ల లైక్స్, 11 లక్షలకు పైగా కామెంట్స్, 1 బిలియన్‌ ఇంప్రెషన్స్‌.. ఇలా యూట్యూబ్‌లో నెవర్ బిఫోర్ రికార్డ్ ‘కె.జి.యఫ్ 2’ సొంతం చేసుకుంది. టీజర్‌ద్వారా ఓరకంగా సునామీనే సృష్టిస్తున్నాడు రాఖీ భాయ్‌. అటు 54 మిలియన్ వ్యూస్‌తో భీమ్, 60 మిలియన్ వ్యూస్‌తో రామరాజు ఇంట్రడక్షన్ టీజర్స్ రచ్చ చేస్తుండగా.. నిన్న గాక మొన్న రిలీజైన రోర్ ఆఫ్ ‘ఆర్ఆర్ఆర్’ 10 మిలియన్‌మార్క్‌కి చేరువలో ఉంది.

రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ లేదు కానీ.. టీజర్స్ సృష్టిస్తున్న రికార్డ్స్‌ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు మేకర్స్. ఖచ్చితంగా అక్టోబర్ 13నే వస్తామంటూ రాజమౌళి చెప్పినా.. అప్పటి పరిస్థితిని బట్టే రిలీజ్ ఉంటుంది. మరోవైపు ప్రేక్షకులతో థియేటర్స్ నిండితేనే రాఖీ భాయ్ వస్తాడంటూ సేఫ్ డేట్‌ను సెలెక్ట్ చేసుకునే పనిలో ఉన్నారు ‘కె.జి.యఫ్ 2’ మేకర్స్. అన్నీ బాగుంటే సెప్టెంబర్‌లో.. లేదంటే డిసెంబర్‌లో వచ్చే ఛాన్స్ ఉందీ ప్రెస్టీజియస్ ఫిలిం. ఇక 77 మిలియన్ వ్యూస్‌తో హంగామా చేస్తోన్న ‘పుష్ప’ ను డిసెంబర్‌లో తీసుకొచ్చే పనిలో ఉన్నాడు బన్నీ.