RRR Making Video: అత్యద్భుతమైన మేకింగ్ వీడియో.. జక్కన్న ప్లానింగ్ అమోఘం

అంచనాలు క్రియేట్ చేయలన్నా.. వాటిని బ్రేక్ చేయాలన్నా రాజమౌళికే చెల్లు. కొద్ది రోజులకు ముందే RRR మూవీ మేకింగ్ వీడియో డేట్ అనౌన్స్ చేసిన టీం అనుకున్నట్లుగానే జులై 15 ఉదయం 11గంటలకు విడుదల చేసింది.

RRR Making Video: అత్యద్భుతమైన మేకింగ్ వీడియో.. జక్కన్న ప్లానింగ్ అమోఘం

Rrr Making Video

RRR Making Video: అంచనాలు క్రియేట్ చేయలన్నా.. వాటిని బ్రేక్ చేయాలన్నా రాజమౌళికే చెల్లు. కొద్ది రోజులకు ముందే RRR మూవీ మేకింగ్ వీడియో డేట్ అనౌన్స్ చేసిన టీం అనుకున్నట్లుగానే జులై 15 ఉదయం 11గంటలకు విడుదల చేసింది. మల్టీస్టారర్ మూవీ మేకింగ్‌లో రాజమౌళితో పాటు టెక్నిషియన్ల కష్టం స్పష్టంగా కనిపిస్తుంది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఫీట్లతో పాటు అజయ్ దేవగన్, అలియా భట్ లపై షాట్లు కాస్త కనిపించాయి. ఇక రాజమౌళి సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతూ.. బాంబ్ బ్లాస్ట్‌లు, ఫైర్ సీన్లు అత్యద్భుతంగా రెడీ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు ర్యాప్ సింగర్ పాటను జత చేసి వీడియో రిలీజ్ చేశారు.

వందల కోట్ల ఖర్చు, ఏళ్ల తరబడి పడిన శ్రమ, ప్రాణం పెట్టిన పనిచేసిన టెక్నిషియన్లు, కెప్టెన్ ఆఫ్ ద టీమ్ రాజమౌళి ఆలోచన అంతా నిమిషం 49సెకన్లలో చూపించేశారు. చివర్లో ఆర్ఆర్ఆర్ ప్రపంచంలోకి అక్టోబర్ 13న తీసుకెళ్తాం అని అనౌన్స్ చేసి రిలీజ్ డేట్ కన్ఫామ్ చేశారు.

450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయిపోయింది. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో డీవీవీ దానయ్య ట్రిపుల్ ఆర్ సినిమాను నిర్మిస్తున్నారు.

కొమ‌రం భీం పాత్ర‌లో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ కనిపిస్తుండగా ముఖ్య పాత్రలో అజయ్ దేవగన్, అలియాభట్, ఒలివియా మోరిస్‌ కనిపిస్తారు.