RRR Mass Anthem : తారక్-చరణ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారుగా!

‘ఆర్ఆర్ఆర్’ మాస్ ఆంథమ్ సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది..

RRR Mass Anthem : తారక్-చరణ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారుగా!

Rrr Mass Anthem 75

RRR Mass Anthem: ‘ఆర్ఆర్ఆర్’ మాస్ ఆంథమ్ సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఎక్కడ విన్నా.. ఎక్కడ చూసినా ఈ పాటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ‘నాటు నాటు’ సాంగ్‌తో రచ్చ లేపారు. ఈ ఇద్దరు హీరోలూ బెస్ట్ డ్యాన్సర్స్ అనే సంగతి తెలిసిందే. అలాంటి వీరిద్దరూ కలిసి స్టెప్పులేస్తే ఇక చెప్పేదేముంటుంది.. రచ్చరంబోలానే కదా..

Jr NTR Fans : ‘సీఎం ఎన్టీఆర్’.. కుప్పంలో ఫ్యాన్స్ నినాదాలు..

కీరవాణి ట్యూన్, చంద్రబోస్ లిరిక్స్, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ పాటను వేరే లెవల్‌కి తీసుకెళ్లాయి. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు.. పిల్లల నుండి పండు ముసలి వరకు అందరూ ఈ పాటకు కాలు కదుపుతున్నారు.

Acharya : ‘చిరుత’నయుడు.. టీజర్ చివరి షాట్ అదిరిందిగా

ఇప్పటివరకు విడుదల చేసిన ఐదు భాషల్లో కలిపి ఏకంగా 75 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో 2022 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా విడుదల కానంత అత్యంత భారీ స్థాయిలో RRR విడుదల కాబోతోంది.

Jai Balayya Song : ఫ్యాన్స్ కోసం రిస్క్ చేసిన బాలయ్య