‘రౌద్రం రణం రుధిరం’- పోస్టర్‌కే పూనకం తెప్పించాడుగా!

దర్శకధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో తెరకెక్కిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’ మోషన్ పోస్టర్ విడుదల..

  • Published By: sekhar ,Published On : March 25, 2020 / 06:31 AM IST
‘రౌద్రం రణం రుధిరం’- పోస్టర్‌కే పూనకం తెప్పించాడుగా!

దర్శకధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో తెరకెక్కిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’ మోషన్ పోస్టర్ విడుదల..

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైంది. ‘బాహుబలి’ సిరీస్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకధీరుడు రాజమౌళి స్వాతంత్ర్య నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్ టైటిల్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ ఉగాది పర్వదినాన టైటిల్ లోగోతో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకి ‘రౌద్రం రణం రుధిరం’ పేరు ఖరారు చేశారు. టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ బ్యౌగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. అంచనాలకు ఏమాత్రం అందకుండా జక్కన్న ఈ RRR ‘రౌద్రం రణం రుధిరం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని అర్థమవుతుంది. సినిమాను 2021 జనవరి 8న విడుదల చేయనున్నారు.

RRR

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘రౌద్రం రణం రుధిరం’  టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ను ఐదు భాషలలో విడుదల చేశారు. తెలుగు లోగో, మోషన్ పోస్టర్ డీవీవీ మూవీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా,  తమిళ్.. జూనియర్ ఎన్టీఆర్ ఆఫీషియల్ అనే ఛానల్ ద్వారా, హిందీ.. అజయ్ దేవగన్, కన్నడ.. వారాహి, మలయాళం.. ఆల్వేస్ రామ్ చరణ్ అనే యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విడుదల చేశారు. 

Read Also : చిరు ఫస్ట్ ట్వీట్ చూశారా!