RRR Movie: తొలి నుంచి కష్టాలే.. 4 ఏళ్ల కల ‘RRR’ సినిమా! పార్ట్-3

మూడేళ్ల క్రితం ట్రిపుల్ ఆర్ సినిమా స్టార్ట్ అయ్యింది. అంతకన్నా ఓ సంవత్సరం ముందే తారక్, ఎన్టీఆర్, రాజమౌళి కలిసి క్రేజీ గా ఓ ఫోటో పోస్ట్ చేసి.. ట్రిపుల్ ఆర్ సినిమా అనౌన్స్ చేశారు.

RRR Movie: తొలి నుంచి కష్టాలే.. 4 ఏళ్ల కల ‘RRR’ సినిమా! పార్ట్-3

Rrr Movie (1)

RRR Movie: మూడేళ్ల క్రితం ట్రిపుల్ ఆర్ సినిమా స్టార్ట్ అయ్యింది. అంతకన్నా ఓ సంవత్సరం ముందే తారక్, ఎన్టీఆర్, రాజమౌళి కలిసి క్రేజీ గా ఓ ఫోటో పోస్ట్ చేసి.. ట్రిపుల్ ఆర్ సినిమా అనౌన్స్ చేశారు. 4 ఏళ్లక్రితం మొదలైన ట్రిపుల్ ఆర్.. ఎప్పటి కప్పుడు ఆడియన్స్ ని ఎగ్జైట్ చేస్తూనే ఉంది. సినిమా మీద ఏమాత్రం ఇంట్రస్ట్ తగ్గకుండా ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూనే ఉంది ట్రిపుల్ ఆర్ టీమ్. 4 ఏళ్ల క్రితం ఆలోచనకి.. సంవత్సరం పాటు సినిమాకు సంబందించి ప్రీ ప్రొడక్షన్, షెడ్యూల్స్, సెట్స్, కాస్ట్యూమ్స్ ఇలా అన్ని రకాలుగా హోమ్ వర్క్ చేసుకుని మూడేళ్ల నాడు సెట్లోకి అడుగుపెట్టింది ట్రిపుల్ ఆర్.

RRR Movie: తొలి నుంచి కష్టాలే.. జక్కన్న డ్రీమ్‌కు దిష్టి తగిలిందా? పార్ట్-1

షూటింగ్ స్టార్ట్ అయ్యిందో లేదో.. కోవిడ్ తో కొన్నాళ్లు బ్రేక్ పడింది. తర్వాత సినిమా స్టార్ట్ అయిన 6 నెలల వరకూ అసలు హీరోయిన్సే దొరకలేదు ట్రిపుల్ ఆర్ కు. ఆ తర్వాత చరణ్ కి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఫిక్స్ అయ్యింది. చరణ్ కి హీరోయిన్ ఫిక్స్ అయ్యింది కానీ.. ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్ ఎడ్గర్ జోన్స్ పర్సనల్ రీజన్స్ తో వెళ్లిపోయింది. మళ్లీ అతి కష్టం మీద హీరోయిన్ ఒలీవియా మోరిస్ దొరకడంతో షూటింగ్ కంటిన్యూ చేశారు. అంతకుముందే షూటింగ్ లో దెబ్బలు తగిలి ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఒకరి తర్వాత ఒకరు షూట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇలా షూట్ క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి సినిమా డిలే అయ్యింది.

RRR Movie: తొలి నుంచి కష్టాలే.. రిస్క్ తీసుకోలేమన్న ట్రిపుల్ఆర్ టీమ్! పార్ట్-2

ఇక షూటింగ్ కి ఎక్కడా బ్రేకుల్లేవు అనుకుంటుండగానే.. సైరా ప్రమోషన్లు అడ్డంపడ్డాయి. సైరా సినిమాకు ప్రొడ్యూసర్ గా చేసిన రామ్ చరణ్.. సినిమా ప్రమోషన్ల కోసం ట్రిపుల్ ఆర్ సినిమాకు గ్యాప్ ఇచ్చారు. అంతేకాదు.. ఎన్టీఆర్ కూడా పర్సనల్ రీజన్స్ తో సినిమాకు బ్రేక్ తీసుకున్నాడు. దాంతో మళ్లీ సినిమా మొదటి కొచ్చింది. సెకండ్ వేవ్ తర్వాత హాలీవుడ్ యాక్టర్స్ రావడానికి లేట్ అవ్వడంతో అక్కడ కూడా డిలే ఫేస్ చేసింది ట్రిపుల్ ఆర్. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ కూడా నటిస్తున్న ఈ సినిమా ఎంతో ప్లాన్ చేసి జులై 33 2020న రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు రాజమౌళి. కానీ కోవిడ్ తో పాటు రకరకాల కారణాలతో సినిమా కంప్లీట్ అవ్వక 2021 అక్టోబర్ 13న సినిమా రిలీజ్ చేస్తున్నట్టు అప్పట్లో కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు.

RRR Postpone: ఆర్ఆర్ఆర్ వాయిదా వెనుక మేకర్స్ లెక్కలివేనా?

కానీ సెకండ్ వేవ్ తో అది కూడా సాధ్యం కాక ఏకంగా సినిమాని జనవరి 7 2022 న రిలీజ్ చేస్తున్నామని ముచ్చటగా మూడో డేట్ ఫిక్స్ చేసినా ఇది కూడా అచ్చిరాలేదు రాజమౌళికి. 400 కోట్లు..1000 రోజులు.. వందల మంది టెక్నీషియన్స్. హాలీవుడ్, సౌత్ నార్త్ స్టార్ కాస్ట్ తో గ్రాండ్ గా మూవీ మేకింగ్.. మొత్తం కలిసి ట్రిపుల్ ఆర్. ఈ మ్యాగ్నమ్ ఒపస్ మూవీని తెరకెక్కించడానికి రాజమౌళి పడ్డ ఇన్నేళ్ల కష్టం కొలిక్కి వచ్చింది అనుకునేలోపే.. రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యి మరోసారి నిరాశ మిగిల్చింది టీమ్ కి.