RRR : జపాన్‌లో 200 రోజులు పూర్తి.. JPY 2 బిలియన్ల కలెక్షన్స్!

జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద RRR జోరు. 200 రోజులు పూర్తి చేసుకొని PY 2 బిలియన్ల కలెక్షన్స్ వైపు..

RRR : జపాన్‌లో 200 రోజులు పూర్తి.. JPY 2 బిలియన్ల కలెక్షన్స్!

RRR movie completed 200 days at japan box office and collect JPY 2 billion

RRR : దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం RRR. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎన్నో అవార్డ్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం నాటు నాటు (Naatu Naatu) పాటకి ఆస్కార్ (Oscar) ని అందుకొని సంచలనం సృష్టించింది. రిలీజ్ అయ్యి ఏడాది పూర్తి అయ్యినా ఈ చిత్రం ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ మూవీ జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు క్రియేట్ చేసింది.

Chiranjeevi: ఇక అవి చాలంటోన్న మెగాస్టార్.. ఒరిజినాలిటీ కోసమేనట!

ఈ చిత్రాన్ని గత ఏడాది అక్టోబర్ లో జపాన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 44 నగరాల్లో 209 స్క్రీన్‌లు, 31 ఐమాక్స్ స్క్రీన్‌స్ లో రిలీజ్ అయిన RRR ఇంకా హౌస్ ఫుల్ రన్స్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ చిత్రం 200 రోజులు పూర్తి చేసింది. జపాన్ లో ఈ ఫీట్ సాధించిన మొదటి ఇండియన్ సినిమాగా RRR రికార్డు సృష్టించింది. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా ఈ మూవీ ఏమా దూకుడు చూపిస్తుంది. దీంతో ఈ చిత్రం JPY 2 బిలియన్ల వైపుగా దూసుకుపోతుంది. ఈ వారంలో RRR ఆ మార్క్ ని అందుకోవడం సందేహం లేదంటున్నారు.

Vijay Deverakonda vs Anasuya : విజయ్ దేవరకొండ విషెస్ చెబుతూ.. హరీష్ శంకర్ అనసూయకు కౌంటర్ ఇచ్చాడా?

ఇప్పటికే అక్కడ 24 ఏళ్ళ పాటు ఉన్న రజినీకాంత్ ముత్తు సినిమా కలెక్షన్స్ రికార్డుని బ్రేక్ చేసి జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద నెంబర్ వన్ ఇండియన్ సినిమాగా నిలిచింది. అలాగే పలు మర్వెల్ మూవీ రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే స్పీడ్ కొనసాగితే జపాన్ హైయెస్ట్ మల్టీప్లేయర్ గా నిలిచిన టైటానిక్ రికార్డుని కూడా RRR మాయం చేయడం ఖాయం అంటున్నారు. మరి RRR ముందు ముందు ఇంకెన్ని రికార్డ్స్ కొల్లగొడుతుందో చూడాలి.