RRR Movie : 14న రాజమౌళి ప్రెస్ మీట్ !

  • Published By: madhu ,Published On : March 13, 2019 / 07:17 AM IST
RRR Movie : 14న రాజమౌళి ప్రెస్ మీట్ !

ప్రముఖ దర్శకుడు ‘రాజమౌళి’ మార్చి 14వ తేదీన ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారంట. ఏ విషయాలపై మాట్లాడుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. న్యూ ప్రాజెక్టు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విశేషాలను తెలియచేస్తారా ? ఇంకా ఏమైనా ఉందా అనే చర్చ సాగుతోంది. ‘రాజమౌళి’ ప్రెస్ మీట్‌ ఏర్పాటుకు సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ సినిమాల అనంతరం లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. అనంతరం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తున్నట్లు, ఇందులో ‘రామ్ చరణ్’, ‘జూ.ఎన్టీఆర్’లు నటిస్తున్నారని జక్కన్న ప్రకటించడంతో ఒక్కసారిగా భారీ అంచనాలు నెలకొన్నాయి. 
Read Also : నా పేరు విజయ్ : చిత్రలహరి టీజర్

చిత్ర షూటింగ్ కూడా ప్రారంభించారు. అయితే సినిమాకు సంబంధించిన ఏ సమాచారం బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తలు పడుతున్నాడు ఈ దర్శకుడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ పాత్రలు ఏంటీ ? వీరి పక్కన ఏ భామ నటించనుందనేది ఇంతవరకు తెలియరాలేదు. దీనితో సామాజిక మాధ్యమాల్లో ఈ మూవీపై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ గాసిప్స్‌పై రాజమౌళి బాధ పడ్డారని టాక్. దీనితో వీటన్నింటికీ చెక్ పెట్టాలని రాజమౌళి నిర్ణయించి..ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. 

సినిమాపై వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తారా ? పుకార్లను ఖండిస్తూ చిత్రంపై పూర్తి వివరాలు తెలియచేస్తారో చూడాలి. ఎంతోకాలం నుండి అభిమానుల్లో ఉన్న ఉత్కంఠ ఈ ప్రెస్‌మీట్‌తో తీరే ఛాన్స్ ఉంది. దాదాపు ‘ఆర్ఆర్ఆర్’ మూవీని రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తీస్తున్నారని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. చిత్రం గురించి మరిన్ని వివరాలకు మార్చి 14వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. 
Read Also : ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం టీజర్.. తెలుగింటి గ‌డ‌ప‌పై విర‌జిమ్మిన ‘విష‌ం’