పది భాషల్లో ప్రతిష్టాత్మకంగా ‘‘RRR’’

‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ఏకంగా పది భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు..

  • Published By: sekhar ,Published On : November 21, 2019 / 05:29 AM IST
పది భాషల్లో ప్రతిష్టాత్మకంగా ‘‘RRR’’

‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ఏకంగా పది భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ కొమురం భీమ్, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే.. తాజాగా ‘‘ఆర్ఆర్ఆర్’’లో హీరోయిన్, విలన్ క్యారెక్టర్స్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. తారక్ సరసన హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ కథానాయికగా నటిస్తోంది.. ఈ మూవీలో ఆమె ‘జెన్నిఫర్’ రోల్ చేస్తోంది.

ప్రతినాయకుడు ‘స్కాట్’ పాత్రలో ప్రముఖ హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ కనిపించనున్నారు. ‘లేడీ స్కాట్’‌గా ఐరిష్ నటి ఎలిసన్ డూడీ నటిస్తున్నారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ఏకంగా పది భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. కేవలం థియేట్రికల్ రిలీజ్ మాత్రమే 10 భాషల్లో చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమా ఇన్ని భాషల్లో విడుదల కాలేదు. అలా అయితే ‘ఆర్ఆర్ఆర్’ మరో బెంచ్ మార్క్ సెట్ చేయనుంది.

Read Also : ఒక్కరోజు మందు తాగకపోతే చచ్చిపోతావా? : 90 ఎంఎల్ – ట్రైలర్

తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు హాలీవుడ్ నటులు ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్‌లోనూ విడుదల చేయవచ్చు అని ఫిలింనగర్ టాక్. అయితే ఏ ఏ భాషల్లో విడుదల చేస్తారనేది తెలియాల్సి ఉంది. చరణ్‌తో అలియా భట్ జతకడుతుండగా.. అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు 70 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది.. డిసెంబరు రెండో వారంలో ఈ చిత్రబృందం నార్త్‌ఇండియాకు వెళ్లనుందని తెలిసింది. అక్కడ దాదాపు 25 రోజుల పాటు చిత్రీకరణ జరుగుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.