RRR : ‘ఆర్ఆర్ఆర్’కి పైరసి దెబ్బ.. ఆ సైట్‌లో అప్పుడే సినిమా..

తాజాగా 'ఆర్ఆర్ఆర్' సినిమా కూడా ఓ పైరసీ సైట్ లో ప్రత్యక్షమైంది. పైరసీ సినిమాలు అప్లోడ్ చేసే పైరేట్ సైట్ తమిళ్ రాకర్స్ లో 'ఆర్ఆర్ఆర్' సినిమాని అప్లోడ్ చేశారు. దీంతో చిత్రయూనిట్......

RRR : ‘ఆర్ఆర్ఆర్’కి పైరసి దెబ్బ.. ఆ సైట్‌లో అప్పుడే సినిమా..

Rrr Piracy

RRR :  రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇటీవల రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది. చరణ్, తారక్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్లని రాబడుతుంది. అయితే చాలా మంది అభిమానులు, ప్రేక్షకులు అత్యుత్సాహంతో సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాల్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో, యూట్యూబ్ లలో పోస్ట్ చేసేస్తున్నారు. దీనివల్ల సినిమాలోని చాలా సన్నివేశాలు బయటకి రావడమే కాక సినిమా చూడని వాళ్ళకి ఇవి చూసి సినిమాపై ఆసక్తి తగ్గుతుంది.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సెకండ్ హాఫ్ వేయకుండానే సినిమా అయిపోయిందన్న అమెరికా థియేటర్

దీనిపై ఇప్పటికే చిత్ర యూనిట్ రిక్వెస్ట్ చేస్తూ అలా వీడియోలు తీయద్దు అంటూ ట్వీట్ కూడా చేశారు. ఇక ఈ సినిమాకి అన్ని సినిమాలలాగే పైరసీ దెబ్బ కూడా పడింది. అన్ని సినిమాలు పైరసికి గురవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని సైట్స్ ని బ్లాక్ చేసినా మళ్ళీ మళ్ళీ పైరసీ సైట్స్ వస్తూనే ఉన్నాయి. దీనివల్ల సినిమాకి చాలా నష్టం చేకూరుతుంది. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కూడా ఓ పైరసీ సైట్ లో ప్రత్యక్షమైంది. పైరసీ సినిమాలు అప్లోడ్ చేసే పైరేట్ సైట్ తమిళ్ రాకర్స్ లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని అప్లోడ్ చేశారు. దీంతో చిత్రయూనిట్ కి ఇది మరో తలనొప్పిలా తయారయింది. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ తో కలిసి ఆ సైట్ ని బ్లాక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు సినిమా టీం.