‘‘RRR’’ హీరోయిన్, విలన్ వీళ్లే!

‘‘ఆర్ఆర్ఆర్’’ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి జోడిగా హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్.. ప్రతినాయక పాత్రలో రే స్టీవెన్‌సన్, ‘లేడీ స్కాట్’గా హాలీవుడ్ నటి ఎలిసన్ డూడీ కనిపించనున్నారు..

  • Published By: sekhar ,Published On : November 20, 2019 / 11:12 AM IST
‘‘RRR’’ హీరోయిన్, విలన్ వీళ్లే!

‘‘ఆర్ఆర్ఆర్’’ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి జోడిగా హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్.. ప్రతినాయక పాత్రలో రే స్టీవెన్‌సన్, ‘లేడీ స్కాట్’గా హాలీవుడ్ నటి ఎలిసన్ డూడీ కనిపించనున్నారు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ కొమురం భీమ్, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే.. బుధవారం సాయంత్రం ‘‘ఆర్ఆర్ఆర్’’లో హీరోయిన్, విలన్ క్యారెక్టర్స్ రివీల్ చేసింది మూవీ యూనిట్. తారక్ సరసన హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ కథానాయికగా నటిస్తోంది.. ఈ మూవీలో ఆమె ‘జెన్నిఫర్’ రోల్ చేస్తోంది.

ప్రతినాయకుడిగా ప్రముఖ హాలీవుడ్ నటుడు రే స్టీవెన్‌సన్ కనిపించనున్నారు. ఈ క్యారెక్టర్‌కి ‘స్కాట్’ అనే పేరు పెట్టారు. ‘లేడీ స్కాట్’ గా ఐరిష్ నటి ఎలిసన్ డూడీ కనిపించనున్నారు. ఎన్టీఆర్ పక్కన ఇంతకుముందు డైసీ ఎడ్గార్ జోన్స్‌ను సెలెక్ట్ చేయగా, అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. 

Read Also : ‘సైరా’ – హిస్టారికల్ 50 డేస్

చరణ్‌తో అలియా భట్ జతకడుతుండగా.. అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు 70 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది..  డిసెంబరు రెండో వారంలో ఈ చిత్రబృందం నార్త్‌ ఇండియాకు వెళ్లనుందని తెలిసింది. అక్కడ దాదాపు 25 రోజుల పాటు చిత్రీకరణ జరుగుతుంది. ‘‘ఆర్ఆర్ఆర్’’ 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది..