చరణ్ – ఎన్టీఆర్ ‘RRR’ లేటెస్ట్ అప్ డేట్ !

  • Published By: veegamteam ,Published On : January 21, 2019 / 10:17 AM IST
చరణ్ – ఎన్టీఆర్ ‘RRR’ లేటెస్ట్ అప్ డేట్ !

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అతిపెద్ద సినిమా ప్రాజెక్టులలో ఒకటి  ఎస్.ఎస్.రాజమౌళి యొక్క ఆర్ఆర్ఆర్, ఈ సినిమాను ఇండియాలోనే హైటెక్నాలజీతో రాజమౌళి మళ్లీ మొదలుపెట్టారు. దీన్ని రామ రావణ రాజ్యం అని పిలుస్తారు. ఈ సినిమాలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ఈ రోజు నుండి మొదలవుతుందని చిత్రబృందం ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ షెడ్యూల్ లో చెయ్యబోయే సన్నివేశాల్లో ఎన్టీఆర్ రఫ్ లుక్ లో కనిపిస్తాడట.
ఇక ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారట.