RRR Movie : ఓరి మీ దుంపలు తెగ.. వైరల్ అవుతున్న ఫన్నీ పోస్ట్..

‘ఆర్ఆర్ఆర్’ స్టోరీ గురించి నెటిజన్ ట్వీట్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన టీం..

RRR Movie : ఓరి మీ దుంపలు తెగ.. వైరల్ అవుతున్న ఫన్నీ పోస్ట్..

Tarak Cherry

RRR Movie: తెలుగు తెరపై ఇద్దరు యంగ్ స్టార్ హీరోల క్రేజీ కాంబినేషన్‌.. తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిచెప్పిన డైరెక్టర్.. వీళ్ల కలయికలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Jai Bhim : టీచర్ మిత్ర క్యారెక్టర్‌కి స్పూర్తి ఈమే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి సంబంధించిన కథ, క్యారెక్టర్ల గురించి ఇటీవల ఓ ఇంటర్వూలో రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. అలాగే రాజమౌళి ఈ సినిమా కథ మనకు తెలిసింది కాకుండా ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్తగా చూపించబోతున్నామని చాలా సార్లు చెప్పారు.

Anasuya Bharadwaj : పొగరున్న దాక్షాయణిగా షాకింగ్ లుక్‌లో అనసూయ!

అయితే రీసెంట్‌గా ఓ నెటిజన్.. 1920లో స్వాతంత్ర్య సమరయోధులు ఇద్దరూ ఇంటినుండి వెళ్లిపోయి, రెండేళ్ల తర్వాత ఇంటికి వచ్చారు. ఆ రెండు సంవత్సరాలలో ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి ఆ భాగాన్ని ఫిక్షనల్‌గా తీసి.. మనకి తెలిసిన స్టోరీని కూడా మార్చి చూపిస్తున్నారా అనేదే డౌట్.. అంటూ ట్వీట్ చేశాడు.

IPL 2021: పర్‌ఫెక్ట్‌గా… పక్కా ప్లానింగ్‌తో కీలకమార్పులు

దీనికి ‘ఆర్ఆర్ఆర్’ టీం అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ‘ఓరి మీ దుంపలు తెగ.. మీరెక్కడ దొరికారు రా.. మీకు తెలిసిన స్టోరీ ఏదీ కూడా సినిమాలో ఉండదని డైరెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు కదా.. మైండ్‌లో నుండి అవన్నీ తీసేసి హాయిగా సినిమా ఏంజాయ్ చెయ్యండి’ అంటూ ఆన్సర్ ఇవ్వగా ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.