RRR Musical rights: కేజీఎఫ్ కంటే ఎక్కువ రేటుకు ఆర్ఆర్ఆర్ మ్యూజికల్ రైట్స్

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయడానికి చిత్రనిర్మాతలు ప్లాన్ చేసుకుంటూ ఉండగా.. ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ హక్కులను టి-సిరీస్ మరియూ లాహరి మ్యూజిక్ దక్కించుకున్నాయి.

10TV Telugu News

RRR music rights: టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయడానికి చిత్రనిర్మాతలు ప్లాన్ చేసుకుంటూ ఉండగా.. ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ హక్కులను టి-సిరీస్ మరియూ లాహరి మ్యూజిక్ దక్కించుకున్నాయి. ఇటీవల కెజిఎఫ్ 2 సౌత్ సంగీత హక్కులను ఈ రెండు సంస్థలు భారీ రేటుకు దక్కించుకోగా.. ఇప్పుడు అంతకుమించి రేటను ఆర్ఆర్ఆర్ కోసం ఇచ్చాయి ఈ రెండు సంస్థలు.

ఆర్ఆర్ఆర్ సంగీత హక్కులను KGF కంటే రెట్టింపు మొత్తాన్ని చెల్లించి దక్కించుకున్నారు. ఎంత ఇచ్చి దక్కించుకున్నారనే విషయాన్ని ప్రకటించలేదు కానీ, రెండు నిర్మాణ సంస్థలు దక్షిణాదిలోని అన్నీ భాషలు, హిందీకి సంబంధించి హక్కులను దక్కించుకున్నట్లు మాత్రం ప్రకటించాయి. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషనల్ సాంగ్ షూట్ హైదరాబాద్లోనే జరుగుతోంది. రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదలకు సిద్ధం అవుతోంది.

“బాహుబలి” ఆడియో హక్కులను పొందిన లహరి మ్యూజిక్ “ఆర్ఆర్ఆర్” ఆడియో రైట్స్ ను టీ సిరీస్ తో కలిసి రికార్డు ధరకు కొనుగోలు చేసినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోని “ఆర్ఆర్ఆర్” ఆడియో రైట్స్ ను ఈ సంస్థలు సొంతం చేసుకున్నాయి. హిందీ ఆడియో రైట్స్ మాత్రం బాలీవుడ్ కు చెందిన ప్రసిద్ధ సంస్థ సొంతం చేసుకుంది. “ఆర్ఆర్ఆర్” బృందం త్వరలో ఈసినిమాకు సంబంధించి మొదటి సాంగ్ ను రిలీజ్ చేయాలని భావిస్తోంది.

10TV Telugu News