RRR : RRR ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు..

రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలుసు. ఒక తెలుగు సినిమాగా మొదలైన RRR ప్రయాణం పాన్ ఇండియాగా, చివరికి పాన్ వరల్డ్ మూవీగా నిలిచింది. ఇక ఇప్పటికే ఈ మూవీ పలు అంతర్జాతీయ పురస్కార నామినేషన్స్ లో స్థానం దక్కించుకుంటూ, అవార్డులను కూడా గెలుచుకుంటూ వస్తుంది. తాజాగా ఈ మూవీ మరో ఇంటర్నేషనల్ అవార్డుని కైవసం చేసుకుంది.

RRR : RRR ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు..

rrr golden tomato

RRR : రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలుసు. ఒక తెలుగు సినిమాగా మొదలైన RRR ప్రయాణం పాన్ ఇండియాగా, చివరికి పాన్ వరల్డ్ మూవీగా నిలిచింది. వరల్డ్ ఫేమస్ డైరెక్టర్స్ స్టీవెన్ స్పీల్‌బెర్గ్, జేమ్స్ కామెరాన్ ఈ మూవీ చూసి రాజమౌళిని ప్రశంసించారు. ఇక ఇప్పటికే ఈ మూవీ పలు అంతర్జాతీయ పురస్కార నామినేషన్స్ లో స్థానం దక్కించుకుంటూ, అవార్డులను కూడా గెలుచుకుంటూ వస్తుంది. తాజాగా ఈ మూవీ మరో ఇంటర్నేషనల్ అవార్డుని కైవసం చేసుకుంది.

RRR in Japan : RRR సరికొత్త రికార్డ్.. జపాన్ లో 100 రోజులు ఆడిన ఫస్ట్ ఇండియన్ సినిమా.. ఎన్ని సెంటర్స్ తెలుసా??

హాలీవుడ్ కి సంబంధించిన ప్రముఖ పాపులర్ సినిమా రివ్యూ వెబ్‌సైట్ అయిన ‘రాటెన్ టొమాటోస్’ 2022 సంవత్సరానికి గాను గోల్డెన్ టొమాటో అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డ్స్ లో కూడా పలు నామినేషన్స్ లో నిలిచిన ఆర్ఆర్ఆర్.. ఫ్యాన్ ఫేవరెట్ మూవీగా అవార్డుని గెలుచుకుంది. ఈ నామినేషన్స్ లో వరల్డ్స్ ఫ్యాన్ ఫేవరెట్ మూవీ అయిన ‘అవతార్’ కూడా ఉంది. అయితే అవతార్ ని కూడా దాటి RRR అవార్డు అందుకోవడంతో ఇండియన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ భారీ మల్టీస్టార్రర్ చిత్రం.. తాజాగా ఆస్కార్ నామినేషన్స్ లో కూడా స్థానం దక్కించుకొని చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. ఒక ఇండియన్ సాంగ్ ఆస్కార్ కి నామినేట్ కావడం ఇదే మొదటిసారి. ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న ‘నాటు నాటు’ ఆస్కార్ కూడా గెలుచుకోవడం ఖాయం అంటున్నారు హాలీవుడ్ సినీ విశ్లేషకులు. ఈ ఏడాది మార్చి 12న అవార్డుల పురస్కారం జరగనుంది. మరి ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అందుకుంటుందా? లేదా? తెలియాలి అంటే మార్చి వరకు ఆగాల్సిందే.