RRR: ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హాట్ టాపిక్‌గా మారిన జెండాలు!

యావత్ దేశంలోని సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్‌ ప్రెస్టీజియస్ క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

RRR: ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హాట్ టాపిక్‌గా మారిన జెండాలు!

Rrr (2)

RRR: యావత్ దేశంలోని సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్‌ ప్రెస్టీజియస్ క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈసారి విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేవు. దీంతో యూనిట్ మరోసారి ప్రేక్షుకులలోకి వెళ్లేలా భారీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే ఇండియాతో పాటు ప్రపంచ దేశాలను చుట్టేస్తున్న ఆర్ఆర్ఆర్ టీమ్ శుక్రవారం దుబాయ్ ప్రమోషన్స్ ముగించుకొని శనివారం కర్ణాటకకి చేరింది.

RRR: 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్.. ఫస్ట్ డే రూ.150 కోట్ల టార్గెట్!

శనివారం చిక్బల్లాపూర్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకి ఆర్ఆర్ఆర్ టీమ్ తో పాటు కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖులు కూడా హాజరవగా ఈ వేడుకకి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ వేడుకకి అటు కర్ణాటకలోని ఎన్టీఆర్-రామ్ చరణ్ అభిమానులే కాదు ఏపీ నుండి కూడా అభిమానులు భారీగా తరలివెళ్ళినట్లు తెలుస్తుంది. చిక్బల్లాపూర్ అనంతపురం జిల్లాకు వంద కిమీ దూరంలోనే ఉండడంతో ఆంధ్రా ఫ్యాన్స్ కూడా భారీగా వెళ్లినట్లు తెలుస్తుంది.

RRR: సెంచరీ కొట్టిన ఆర్ఆర్ఆర్.. ఆలస్యమైనా తగ్గని క్రేజ్!

కాగా.. ఈ వేడుకలో జెండాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈవెంట్ ఆర్గనైజర్లు రకరకాల రంగుల జెండాలతో ఆ ప్రాంతాన్ని అలంకరించగా అభిమానులు మాత్రం రెండు రంగుల జెండాలతోనే కనిపించారు. తారక్ బొమ్మ ముద్రించిన పసుపు జెండాలతో ఎన్టీఆర్ అభిమానులు భారీగా హాజరవగా.. రామ్ చరణ్ బొమ్మ ముద్రించిన తెలుపు-ఎరుపు రంగుల జెండాలతో రామ్ చరణ్ అభిమానులు భారీగా వేడుకలో కనిపించారు. ఈవెంట్ మొదలై సెలబ్రిటీలు వచ్చే సమయానికి చీకటి పడడంతో వాళ్ళు పెద్దగా గమనించే అవకాశం లేకపోగా సాయంత్రం నుండి తరలివచ్చిన అభిమానుల వద్ద ఈ రెండు రంగుల జెండాలు భారీగా కనిపించాయి.

RRR: రెండు భిన్న ధృవాలు.. చెలరేగిపోతున్న తారక్.. గుంభనంగా చరణ్!

ఎన్టీఆర్ బొమ్మలున్న పసుపు జెండాలు తెలుగుదేశం పార్టీ రంగు కాగా.. రామ్ చరణ్ బొమ్మతో కూడిన తెలుపు-ఎరుపు జెండాలు జనసేన పార్టీ రంగులని అందరికీ తెలిసిందే. సాధారణంగా అటు నందమూరి కుటుంబాన్ని కానీ.. ఇటు మెగా ఫ్యామిలీని కాని టీడీపీ, జనసేన పార్టీల నుండి విడదీసి చూడడం కష్టం. అందుకే ఈ హీరోలకి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఈవెంట్లు జరిగినా అక్కడ ఈ రంగుల జెండాలు కనిపిస్తుంటాయి.. నినాదాలు వినిపిస్తుంటాయి. అయితే.. ఆర్ఆర్ఆర్ పుణ్యమా అని ఒకే వేడుకలో రెండు పార్టీల రంగుల జెండాలు భారీగా కనిపించాయి. ఈ మధ్యనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున చేసిన వ్యాఖ్యలతో టీడీపీ-జనసేన పొత్తుపై ఏపీలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతుండగానే చిక్బల్లాపూర్ ఈవెంట్ లో ఈ రెండు పార్టీల జెండాలు కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.