#RRR మూవీ అద్భుతంగా ఉంటుంది : ఎన్టీఆర్

#RRR మూవీ అద్భుతంగా ఉంటుంది : ఎన్టీఆర్

#RRR మూవీ అద్బుతం అంటున్నారు ఎన్టీఆర్. కొమరం భీంగా నటించటం మరో విశేషంగా చెప్పుకొచ్చారు. ఇగోలు పక్కనపెట్టి.. స్టార్ ఇమేజ్ లేకుండా ఈ మూవీ తీస్తున్నట్లు వెల్లడించారు ఎన్టీఆర్. రాజమౌళితో తీస్తున్న నాలుగో సినిమా ఇది అని.. ఎంతో ఉత్కంఠ.. ఏదో తెలియని భావోద్వేగం ఉందన్నారు.
Read Also : #RRR మూవీ : రిలీజ్ డేట్ ఫిక్స్, బడ్జెట్ ఎంతో చెప్పేశారు

రామ్ చరణ్‌తో నటించడం ఆనందంగా ఉందని.. తామిద్దరికీ దిష్టి తగులకూడదని అనుకుంటున్నట్లు తెలిపారు. అల్లూరి సీతరామరాజు, కొమరంభీం గొప్ప వ్యక్తులని.. వారిద్దరూ కలిసి ఉంటే ఏమి జరుగుతుందో.. తెరపై జక్కన్న చూపించాలి అనుకోవటం అద్భుతం అన్నారు. నటులుగా ఎదగడానికి ఈ సినిమా ఎంతో దోహదం చేస్తుందన్నారు. షూటింగ్ ప్రారంభం కంటే ముందే వర్క్ షాప్ నిర్వహించి.. ట్రైనింగ్‌ తీసుకున్నట్లు తెలిపారు ఎన్టీఆర్. తమకు అవకాశం కల్పించిన జక్కన్నకు కృతజ్ఞతలు తెలియజేశాడు.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీస్తున్న RRR మూవీ తన కెరీర్‌లో స్పెషల్‌ సినిమాగా నిలిచిపోతోందన్నారు.. అంతేగాకుండా గొప్ప చిత్రంగా నిలుస్తుందన్నారు ఆశాభావం వ్యక్తం చేశారు. జక్కన్నతో ఇది నాలుగో చిత్రం.. అన్నింటికంటే ఈ సినిమా స్పెషల్‌గా నిలుస్తుందన్నారు.
Read Also : అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కలిస్తే #RRR మూవీ