#RRR : NTR‌కి వాయిస్ చెప్పిన చరణ్..

  • Published By: sekhar ,Published On : October 20, 2020 / 06:16 PM IST
#RRR : NTR‌కి వాయిస్ చెప్పిన చరణ్..

#RamarajuForBheem: దర్శకధీరుడు SS Rajamouli, మెగా ప‌వ‌ర్ స్టార్ Ram Charan యంగ్ టైగ‌ర్ NTR లు హీరోలుగా నటిస్తున్న విష‌యం తెలిసిందే.. అల్లూరి సీతారామ‌రాజు లాంటి ప‌వ‌ర్‌ఫుల్ పాత్రలో రామ్ చ‌ర‌ణ్ బాడి షేపింగ్ తో అద్భుత‌మైన విజువ‌ల్స్ తో తారక్ వాయిస్ ఓవ‌ర్ తో రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టీజర్ విడుద‌ల చేశారు.


అయితే త‌రువాత ఎన్‌టిఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కొమ‌రం భీమ్ టీజ‌ర్ విడుదల చేయాలనుకున్నారు కానీ కరోనా పాండమిక్ సిట్యువేష‌న్ వ‌లన కుద‌ర‌లేదు. ఆక్టోబ‌ర్ 22న కొమరం భీం జయంతి సందర్భంగా ఉదయం 11 గంటలకు తారక్ వీడియో రిలీజ్ చేస్తున్నారు.


ఇప్ప‌ట‌కే రామ్‌ చ‌ర‌ణ్ డ‌బ్బింగ్ పూర్తి చేశాడట. ఉద‌యం లేవ‌గానే గొంతుకు సంబంధించిన లిక్విడ్స్ తీసుకుని మ‌రీ డ‌బ్బింగ్ చెప్పడం విశేషం.. అలాగే అన్ని భాష‌ల్లోనూ తనే డబ్బింగ్ చెప్పాడు. రామ్ చరణ్ వాయిస్ చెప్పిన టీజ‌ర్ చూసిన వారంతా రాజ‌మౌళిని అప్రిషియేట్ చేస్తున్నారట.


ఇద్దరు హీరోల గొంతులతో ఒకరిచేత మరొకరికి డబ్బింగ్ చెప్పించడం రాజమౌళి గొప్పతనమనే చెప్పాలి. సినిమాలో తారక్, చెర్రీ పాత్ర‌లు కూడా స‌మానంగా స‌మ‌రంగా వుంటాయ‌ట. 22 న టీజ‌ర్ లో రామ్ చ‌ర‌ణ్ గ‌ట్టిగా వినిపించ‌బోతున్నాడు.