RRR Re Release : అమెరికాలో RRR రీ రిలీజ్.. అతి పెద్ద థియేటర్ హౌస్ ఫుల్.. టికెట్ల కోసం క్యూ లైన్లో ఫారినర్స్..

త్వరలోనే ఆస్కార్ వేడుకలు ఉండటంతో పాటు, అమెరికాలో RRR సినిమాని రీ రిలీజ్ చేస్తుండటంతో RRR చిత్ర యూనిట్ అంతా ఇప్పటికే అమెరికాకి వెళ్లి సందడి చేస్తూ సినిమాని మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీ రిలీజ్ కి కూడా అమెరికాలో RRR సినిమాకి భారీ స్పందన..................

RRR Re Release : అమెరికాలో RRR రీ రిలీజ్.. అతి పెద్ద థియేటర్ హౌస్ ఫుల్.. టికెట్ల కోసం క్యూ లైన్లో ఫారినర్స్..

RRR Re Release in America theaters goes housefull and hollywood audience waiting for RRR Tickets

RRR Re Release :  RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని రోజులు పేరు, ప్రఖ్యాతలు, కలెక్షన్స్ సాధించిన RRR సినిమా ఇప్పుడు అవార్డుల వేట మొదలుపెట్టింది. అంతర్జాతీయ వేదికపై వరుసగా అవార్డులు సాధిస్తుంది. ఇటీవలే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ఏకంగా అయిదు అవార్డులు కొల్లగొట్టింది. RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ అయితే ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించింది. ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచింది.

త్వరలోనే ఆస్కార్ వేడుకలు ఉండటంతో పాటు, అమెరికాలో RRR సినిమాని రీ రిలీజ్ చేస్తుండటంతో RRR చిత్ర యూనిట్ అంతా ఇప్పటికే అమెరికాకి వెళ్లి సందడి చేస్తూ సినిమాని మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీ రిలీజ్ కి కూడా అమెరికాలో RRR సినిమాకి భారీ స్పందన వస్తుంది. సినిమా రిలీజ్ అయి దాదాపు సంవత్సరం అవుతుండగా అమెరికాలో రీ రిలీజ్ చేసినా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఫారినర్స్ మళ్ళీ ఈ సినిమాని చూడటానికి ఎగబడుతున్నారు.

Sobhita Dhulipala : బ్యాక్‌గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరావు అన్నారు.. అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాను.. శోభిత వ్యాఖ్యలు..

అమెరికా లాస్ ఏంజిల్స్ లోని అతిపెద్ద థియేటర్ లో 1647 సెట్లు ఉండగా రీ రిలీజ్ సందర్భంగా అన్ని టికెట్స్ సోల్డ్ అయిపోయాయి. ఇంకా టికెట్స్ కోసం హాలీవుడ్ ప్రేక్షకులు థియేటర్ బయట లైన్స్ లో వెయిట్ చేస్తున్నారంటే మన RRR సినిమా అక్కడ ఏ రేంజ్ లో హిట్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఈ థియేటర్ లో ప్రదర్శన అయ్యాక రాజమౌళి ప్రేక్షకులతో మాట్లాడారు. సినిమా రిలీజ్ అయిన సంవత్సరం తర్వాత కూడా ఈ రేంజ్ లో స్పందన వస్తుండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆస్కార్ టార్గెట్ గా రాజమౌళి అమెరికాలోనే ఉండి అన్ని రకాల ప్రమోషన్స్ చేస్తున్నారు. లాస్ ఏంజిల్స్ థియేటర్ బయట జనాలు టికెట్ల కోసం లైన్ లో వెయిట్ చేస్తున్న వీడియోని RRR చిత్ర యూనిట్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.