RRR: ఓటీటీలో ఆర్ఆర్ఆర్.. రీ ఎడిటింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తారా?

ఆర్ఆర్ఆర్.. రిలీజ్‌కు ముందు ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి భారీ అంచనాలను క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా..

RRR: ఓటీటీలో ఆర్ఆర్ఆర్.. రీ ఎడిటింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తారా?

RRR

RRR: ఆర్ఆర్ఆర్.. రిలీజ్‌కు ముందు ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి భారీ అంచనాలను క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం.. ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అనుకున్నట్లే కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది ట్రిపుల్ ఆర్. సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలు గడుస్తున్నా.. బాక్సాఫీస్ వద్ద ఇంకా పంజా విసురుతోంది.

RRR: సర్‌ప్రైజ్.. నాటు నాటు ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది!

కేవలం దక్షిణాదినే కాకుండా బాలీవుడ్‌లోనూ ఆర్ఆర్ఆర్ ట్రెమెండస్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా కళ్లుచెదిరే వసూళ్లను రాబడుతుంది. ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల నుండు రెండు వేల కోట్ల వైపు పరుగులు పెడుతున్న ఆర్ఆర్ఆర్ దెబ్బకి కొత్త సినిమాలేవీ థియేటర్లలో నిలబడలేకపోతున్నాయి. ఇక, ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడొస్తుందా ఇంకోసారి చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కోసం రాజమౌళి మరోసారి అదనంగా వర్క్ చేయబోతున్నట్లు వినిపిస్తోంది.

RRR: జక్కన్న ఊహించిన దానికంటే తారక్ బెటర్ పర్ఫామెన్స్.. కామెంట్స్ వైరల్!

ఈ సినిమా జీ-5, నెట్ ప్లిక్స్ ద్వారా ఓటీటీ రిలీజ్ కానుంది. అయితే ఓటీటీలో రీ ఎడిటింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. దీని కోసం జక్కన్న అండ్ కో మరోసారి ఎడిటింగ్ టేబుల్ పై సుదీర్ధంగా వర్క్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఓటీటీ రిలీజ్ కోసం థియేట్రికల్ రిలీజ్ లో తొలగించిన సన్నివేశాల్ని యాడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం ఓటీటీ సంస్థలతో డీల్ కుదిరే ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే జక్కన్న ఓటీటీ వెర్షన్ కోసం మరోసారి శ్రమించేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే వేచి చూడాలి.